Telugu Movies Releasing This Week On OTT and Theaters: తెలుగు ప్రేక్షకులకు ఈ వారం పండగే. ఇటు థియేటర్లలో, అటు ఓటీటీల్లో... కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో సందడి నెలకొంది. తెలుగు సినిమాలకు తోడు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. దాంతో పండగ వాతావరణం నెలకొంది. వినోదమే వినోదం!


రామ్ ఊర మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌... 'ది వారియర్'
ఇప్పుడు తెలుగు, తమిళ ప్రేక్షకుల అందరి చూపు ఉస్తాద్ రామ్ కథానాయకుడిగా దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన 'ది వారియర్' మీద ఉందని చెప్పాలి. ఈ వారం విడుదలవుతున్న చిత్రాల్లో భారీ చిత్రమిది. ఫస్ట్ టైమ్ రామ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం... దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన 'బుల్లెట్, 'విజిల్' సాంగ్స్ ఛార్ట్ బస్టర్లుగా నిలవడం... రామ్ ఎనర్జీకి కృతి శెట్టి గ్లామర్ యాడ్ అవ్వడం... ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఖర్చుకు వెనుకాడలేదని ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. గురువారం (జూలై 14న) సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. 



తండ్రి కోసం సాయి పల్లవి న్యాయ పోరాటం... 'గార్గి'
కథానాయిక సాయి పల్లవికి తెలుగునాట సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్లకు ఓ గుడ్ న్యూస్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'గార్గి' తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. పోలీసుల చెర నుంచి తండ్రిని విడిపించడానికి ఓ కుమార్తె చేసే న్యాయ పోరాటమే 'గార్గి' కథ. విభిన్న కథాంశాలు, థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది.



ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన 'మై డియర్ భూతం' సినిమా సైతం జూలై 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'అమ్మాయి : డ్రాగన్ గాళ్' విడుదల కూడా జూలై 15నే. ఈ సినిమా హిందీలో 'లడకీ'గా విడుదలవుతోంది. తెలుగు, హిందీతో పాటు చైనీస్, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.
 
మిథాలీ రాజ్ బయోపిక్... 'శభాష్ మిథు'
ప్రముఖ లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ ఇది. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించారు. మహిళా క్రికెట్‌కు ఎదురైన అడ్డంకులు, మిథాలీ రాజ్ ఎదుర్కొన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. క్రికెట్ ప్రేమికులు, మిథాలీ రాజ్ కథ తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారిని 'శభాష్ మిథు' ఆకర్షిస్తోంది.



హిందీలో తెలుగు 'హిట్' రీమేక్!
విశ్వక్ సేన్ హీరోగా నేచురల్ స్టార్ నాని నిర్మించిన 'హిట్' సినిమాను హిందీలో రీమేక్ చేశారు. అక్కడ రాజ్ కుమార్ రావు హీరోగా నటించగా... మాతృకకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీ సినిమానూ తెరకెక్కించారు. భూషణ్ కుమార్, కృష్ణకుమార్, కులదీప్ రాథోడ్ తో కలిసి 'దిల్' రాజు నిర్మించారు.


సుశాంత్ ఓటీటీ ఎంట్రీ... 'మా నీళ్ల ట్యాంక్'
'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్‌తో సుశాంత్ ఓటీటీలో అడుగు పెడుతున్నారు. ఆయన నటించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ ఇది. ఇందులో ప్రియా ఆనంద్ హీరోయిన్. ఈ నెల 15 నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ కానుంది. 'వరుడు కావలెను' ఫేమ్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. వినోదాత్మక సన్నివేశాలతో సున్నితమైన కథతో వెబ్ సిరీస్ తీసినట్టు తెలుస్తోంది. 



తెలుగులోనూ కీర్తీ సురేష్ మలయాళ సినిమా!
కీర్తీ సురేష్ మలయాళంలో 'వాషి' అని ఒక సినిమా చేశారు. స్పెషాలిటీ ఏంటంటే... ఆ సినిమాకు కీర్తీ సురేష్ తండ్రి జి సురేష్ కుమార్ నిర్మాత. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమాను మలయాళం సహా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో జూలై 17న విడుదల చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.


Also Read: సమంత సినిమాలో అనుష్క ఉందా?


ఓటీటీల్లో ఈ వారం సందడి చేయనున్న ఇతర సినిమాలు, వెబ్ సిరీస్‌లు:



  • డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూలై 15 నుంచి హిందీ వెబ్ సిరీస్ 'శూర్‌వీర్‌' స్ట్రీమింగ్ కానుంది. ఇందులో రెజీనా మెయిన్ రోల్ చేశారు.

  • 'ఆహా' ఓటీటీలో జూలై 15న కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరిల 'సమ్మతమే' విడుదల.

  • నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 14న 'కుంగ్ ఫు పాండా: ది డ్రాగన్ నైట్' వెబ్ సిరీస్ విడుదల.

  • జీ 5లో జూలై 15న నుష్రత్ బరూచా నటించిన హిందీ సినిమా 'జ‌న్‌హిత్‌ మేరీ జాన్' విడుదల. 

  • నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 14న హిందీ సినిమా 'జాదూగర్' విడుదల అవుతోంది. 


Also Read : రామ్ (Ram) తో కచ్చితంగా సినిమా ఉంటుంది - హరీష్ శంకర్