యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. మొన్నామధ్య ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వదలగా.. యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది. అలానే 'లైగర్ హంట్' అనే సాంగ్ థీమ్ ను కూడా రిలీజ్ చేశారు.


ఇక తాజాగా సినిమా నుంచి 'అక్డి పక్డి' అనే మాస్ ట్రాక్ ను రిలీజ్ చేశారు. విజయ్, అనన్యల మధ్య సాగే సాంగ్ ఇది. ఈ పాటకు సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో విడుదల చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ మాస్ స్టెప్స్ మాములుగా లేవు. ఫ్లోర్ స్టెప్స్ కూడా వేసి ఆశ్చర్యపరిచారు విజయ్. ప్రస్తుతం ఈ పాట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ 'అక్డి పక్డి' అంటే అర్ధమేంటో సినిమాలో రివీల్ చేస్తారేమో చూడాలి!  


ఈ ఏడాది ఆగస్ట్ 25న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు. 


Also Read: ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశానని చితకబాదారు - సాయిపల్లవి కామెంట్స్


Also Read: నితిన్‌కు డ్యాన్స్ రాదు, నేనే నేర్పించా! ఈ రోజు నన్నే అవమానించాడు - అమ్మ రాజశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్