Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయనకు కుమార్తె పుట్టబోతుంది అంటూ పలు మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. పుతిన్ ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయేవా ప్రెగ్నెంట్ అని వార్తలు బయటకు వచ్చాయి.
నిజమేనా?
కబయేవా గర్భం దాల్చిందని, త్వరలోనే ఆమె మరోబిడ్డకు జన్మనివ్వబోతోందని సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా జరిపిన లింగ నిర్దారణ పరీక్షల్లో ఆమెకు ఆడపిల్ల పుట్టనున్నట్లు తేలింది.
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన రిథమిక్ జిమ్నాస్ట్ అలీనాకు పుతిన్ వల్ల ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. 2015లో అలీనాకు కుమారుడు జన్మించాడు. 2019లో రెండో కుమారుడు జన్మించాడని స్విస్ బ్రాడ్ షీట్ వార్తా సంస్థ ఓ కథనంలో రాసుకొచ్చింది.
మంచుకొండల్లో
మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతోన్న వేళ తన కుటుంబాన్ని సురక్షితంగా సైబీరియా ప్రాంతంలోని అట్లాయ్ పర్వతాల వద్ద నిర్మించిన అణుబంకర్లలో భద్రంగా దాచిపెట్టారు పుతిన్.
అయితే తన రహస్య ప్రియురాలు జిమ్నాస్ట్ అలీనా కబయేవాను పుతిన్ ఎక్కడ దాచిపెట్టారో తెలుసా? మంచుకొండలకు నిలయమైన స్విట్జర్లాండ్‌లో అలీనా కబయేవా, ఆమె నలుగురు పిల్లలను అత్యంత భద్రమైన ప్రాంతంలో దాచిపెట్టారట. ఆమె గురించి ఈ వివరాలు తెలుసా?
పతకాల రారాణి
- అలీనా కబయేవా.. 1983లో పుట్టారు. మూడేళ్ల వయసులోనే రిథమిక్ జిమ్నాస్టిక్స్ సాధన ప్రారంభించారు.
- 15 ఏళ్ల వయసుకే ఐరోపా ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు.
- అత్యంత చిన్నవయసులో ఆ ఘనత సాధించిన తొలి రష్యన్‌గా నిలిచారు.
- 1999 రెండోసారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్, వరల్డ్ టైటిల్‌ను గెలుపొందారు.
- రెండు ఒలింపిక్ పతకాలు, 14 వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లు, 21 ఐరోపా ఛాంపియన్‌షిప్‌లను సొంతం చేసుకున్నారు.
- డోపింగ్ ఆరోపణలతో రెండేళ్లు నిషేధం ఎదుర్కొన్న అలీనా.. 2004లో రిటైర్మెంట్ ప్రకటించారు.
రష్యా రాజకీయం
- ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి 2005లో పబ్లిక్ ఛాంబర్ ఆఫ్ రష్యా సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
- తర్వాత 2008లో పబ్లిక్ కౌన్సిల్ ఆఫ్ జాతీయ మీడియా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు.
- 2007, 2014లో దుమా రాష్ట్రం నుంచి యునైటెడ్ రష్యా పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు.
అక్కడే ప్రేమ
ఇలా రాజకీయంగా ఎదుగుతోన్న సమయంలో కబయేవాకు పుతిన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2008లోనే పుతిన్-కబయేవా బంధం గురించి వదంతులు వ్యాపించాయి. భార్యకు విడాకులిచ్చి కబయేవాను పెళ్లిచేసుకునే అలోచనలో పుతిన్ ఉన్నట్టు స్థానిక మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ పుతిన్ వీటిని ఖండించారు.
Also Read: AIADMK General Council: OPSకు పళనిస్వామి ఝలక్- పార్టీ నుంచి బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం