'యశోద'... నేషనల్ స్టార్ సమంత టైటిల్ రోల్‌లో నటిస్తున్న సినిమా. ఫిమేల్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రమిది. లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... ఒక్క పాట మినహా సినిమా చిత్రీకరణ కంప్లీట్ అయ్యింది. టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది.


శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా 'యశోద'ను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ''ఉన్నత సాంకేతిక విలువలు, భారీ  నిర్మాణ వ్యయంతో 'యశోద' చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశాం. ఒక్క పాట మినహా చిత్రీకరణ కంప్లీట్ అయ్యింది. ఒకవైపు గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. ఆ వెంటనే ఇతర భాషల డబ్బింగ్ కూడా జరుగుతుంది. పాన్ ఇండియన్ చిత్రంగా విడుదల చేయడానికి 'యశోద' పూర్తిగా సిద్ధమాయ్యాకే... మంచి తేదీ చూసుకుని కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.


సమంత గురించి శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ''సమంత 'యశోద' పాత్రను సొంతం చేసుకున్న తీరు చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎంతో డెడికేషన్‌తో యాక్షన్, ఇతర సీన్స్ అద్భుతంగా చేశారు. ఇదొక సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్'' అని అన్నారు. 


Also Read: సమంత సినిమాలో అనుష్క ఉందా?


హరి - హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్న 'యశోద'లో సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగ‌ణం. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.



Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు