బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను తమ వర్గం ఎప్పటికీ క్షమించదని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ జైలు శిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఈ విచారణలో అతడు కొన్ని విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. కృష్ణజింక హత్యకు సంబంధించి తమ వర్గం ఎప్పటికీ సల్మాన్ ఖాన్ ను క్షమించదని చెప్పుకొచ్చాడు. 


సల్మాన్ గనుక బహిరంగ క్షమాపణలు చెబితే అప్పుడు క్షమిస్తామని లారెన్స్ పేర్కొన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. జోధ్‌పూర్‌ అడవి సమీపంలో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ కి కోర్టు శిక్ష విధించగా.. బెయిలుపై బయటకు వచ్చాడు. ఇప్పటికీ ఈ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే కృష్ణ జింకలను చంపినందుకు సల్మాన్ ఖాన్ ను శిక్షించాలని భావించిన లారెన్స్ గ్యాంగ్ 2018లో అతడిని చంపాలనుకున్నారు. 


కానీ కుదరలేదు. ఇటీవల సల్మాన్ ఖాన్ తండ్రికి, అతడి తరఫు లాయర్ కి కూడా లారెన్స్ గ్యాంగ్ నుంచి హత్యా బెదిరింపు లేఖలు వచ్చాయి. ఇద్దరికీ సిద్ధూ మూస్ వాలా గతే పడుతుందని లేఖల్లో పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై ఢిల్లీ పోలీసులు లారెన్స్ ను ప్రశ్నించగా.. అతడు ఈ విషయాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ కమ్యూనిటీలో కృష్ణ జింకను దైవంగా భావిస్తారు. అందుకే సల్మాన్ ఖాన్ ను చంపాలనుకున్నారు. 


ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'కభీ ఈద్ కభీ దివాలి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలానే వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. కానీ ఈ విషయంలో క్లారిటీ లేదు. 


Also Read: ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశానని చితకబాదారు - సాయిపల్లవి కామెంట్స్


Also Read: నితిన్‌కు డ్యాన్స్ రాదు, నేనే నేర్పించా! ఈ రోజు నన్నే అవమానించాడు - అమ్మ రాజశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్