Kanguva twitter review and rating in Telugu: కోలీవుడ్ స్టార్ హీరో, టాలీవుడ్ ఆడియన్స్ సైతం మెచ్చిన నటుడు సూర్య (Suriya). ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'కంగువ' (Kanguva). తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రీమియర్ షోస్ ఆల్రెడీ దుబాయ్, అమెరికాలో పడ్డాయి. మరి, సోషల్ మీడియాలో ఈ సినిమా టాక్ ఎలా ఉంది? అనేది ఈ ట్విట్టర్ రివ్యూలో చూడండి.


ఎంట్రీ సీక్వెన్సులు... ఒక్కటి కాదు, రెండు!
'కంగువ'లో సూర్య డ్యూయల్ రోల్ చేశారని ఆడియన్స్ అందరికీ తెలుసు. ఒకటి వారియర్ కంగువ రోల్ అయితే, మరొకటి ప్రజెంట్ జనరేషన్ క్యారెక్టర్ ఫ్రాన్సిస్. ఆ రెండు క్యారెక్టర్లకు రెండు ఇంట్రడక్షన్లు ఉన్నాయి. ఆ రెండూ సూపర్బ్ అని ఆల్రెడీ ప్రీమియర్స్ చూసిన జనాలు చెబుతున్నారు. ముఖ్యంగా 'కంగువ' క్యారెక్టర్ ఇంట్రో కేక అని పోస్టులు చేస్తున్నారు. సూర్యకు స్పెషల్ ఇంట్రో కార్డు వేశారట. అదీ సూపర్ అని చెబుతున్నారు.






'కంగువ'కు బ్లాక్ బస్టర్ టాక్... హిట్టు బొమ్మ!
సూర్య ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో 'కంగువ' రివ్యూలు చూసి హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ పాజిటివ్ టాక్ వచ్చింది. సూర్య నటనతో తోడు స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉండటంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యిందని అంటున్నారు. సూర్య, బాబీ డియోల్ మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా సూపర్ ఉన్నాయట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, దిశా పటానీ గ్లామర్ సూపర్ సూపర్ హిట్ అని టాక్ వచ్చింది.






Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే



నటుడిగా సూర్య నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మన్స్!
స్టార్ స్టేటస్ సొంతం చేసుకోవడం వేరు, నటుడిగా పేరు తెచ్చుకోవడం వేరు. సూర్య స్టార్ స్టేటస్‌తో పాటు నటుడిగా ఎప్పుడో పేరు తెచ్చుకున్నారు. 'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్' సినిమాల్లో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ఎంత బాగా చేశారో... 'విక్రమ్'లో రోలెక్స్ పాత్రలో కనిపించింది కాసేపే అయినప్పటికీ విలనిజంలో దుమ్ము దులిపేశారు. ఇప్పుడీ 'కంగువ'లో యోధుడిగా ఇరగదీశారట. రెండు క్యారెక్టర్లలో వేరియేషన్ చూపించడమే కాదు... అంతకు మించి అనేలా చేశారట. అయితే, తెలుగు డబ్బింగ్ విషయంలో ఫ్యాన్స్ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.






Also Read: తెలుగులో సూర్య సూపర్ హిట్ సినిమాలు... ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?



ఎండింగ్ టెర్రిఫిక్... 'కంగువ 2' కోసం వెయిటింగ్!
'కంగువ' ఎండింగ్ టెర్రిఫిక్ అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. స్టోరీ చాలా అంటే చాలా బావుందని చెబుతున్నారు. 'కంగువ 2' కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ట్విట్టర్ లో కొంత నెగెటివిటీ కూడా ఉంది. సినిమా బాలేదని కొన్ని పోస్టులు కనబడుతున్నాయి. వాటిని మర్చిపోమని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు.






















Also Read: సూర్యకు భారీ రెమ్యూనరేషన్... 'కంగువ' నటీనటుల్లో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ఎవరికో తెలుసా?



ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా చాలా బెటర్!
ఇంట్రో సీక్వెన్సులు సూపర్బ్ అనేలా ఉన్నప్పటికీ... సినిమా మొదలైన అరగంట తర్వాత కొంత డౌన్ అయ్యిందని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ సైతం ప్రెడిక్ట్ చేసేలా ఉందట. కానీ, సెకండాఫ్ మాత్రం సూపర్ ఉందని, మూవీ అదరగొట్టేశారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. 'కంగువ' ట్విట్టర్ రివ్యూల్లో కొన్నిటిని ఇక్కడ చూడండి. 


బాబోయ్... అతడు 3.5 ఇచ్చాడా?
దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ అని చెప్పుకొనే ఉమైర్ సందు ఫేక్ అని చాలా విమర్శలు  ఉన్నాయి. ప్రతి సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇవ్వడం అతని స్టైల్. కానీ, 'కంగువ' సినిమాకు అతడు 3.5 రేటింగ్ ఇవ్వడం నెటిజనులను ఆశ్చర్యానికి గురి చేసింది. సూర్య సినిమా మీద అతడు చేసిన ట్వీట్ ఎలా ఉందో చూడండి.