సూర్య శివకుమార్ (Suriya Sivakumar)ది తమిళనాడు కావచ్చు. కానీ, తెలుగు ప్రజలు ఎప్పుడో సోంతం చేసుకున్నారు. తెలుగు హీరోలతో సమానంగా ఆదరిస్తున్నారు. ఈ కోలీవుడ్ కథానాయకుడిని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమాలు ఏవి? ఇప్పుడు ఆ సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయి? సూర్య సూపర్ హిట్ ఫిలిమ్స్, వాటి ఓటీటీ పార్ట్నర్స్ ఏవో ఓ లుక్ వేయండి.


తెలుగులో సూర్య తొలి హిట్ 'గజినీ'
బాల దర్శకత్వం వహించిన 'శివ పుత్రుడు' (తమిళంలో 'పితామగన్') తెలుగులో కూడా విజయం సాధించింది. అందులో విక్రమ్, సూర్య నటించారు. అయితే, ఆ సినిమాతో సూర్యకు అంతగా పేరు రాలేదు. విక్రమ్ హైలైట్ అయ్యారు. 


'శివ పుత్రుడు' వచ్చిన రెండేళ్లకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'గజినీ' చేశారు సూర్య. తమిళంలో మాత్రమే కాదు... తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ విజయంతో పాటు సూర్యకు తొలి హిట్ అందించింది. ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


సూర్య సన్నాఫ్ కృష్ణన్... క్లాసిక్ హిట్!
'సూర్య సన్నాఫ్ కృష్ణన్' (తమిళంలో 'వారనం ఆయిరమ్')ను తెలుగులో రీ రిలీజ్ చేశారు. అప్పుడు థియేటర్లలో సందడి ఎవరైనా చూస్తే... అది తమిళ్ సినిమా అంటే ఒప్పుకోరు. ఆ స్థాయిలో ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూట్యూబ్‌లో ఉంది. దీనిని ఫ్రీగా చూడొచ్చు. జీ 5 ఓటీటీలోనూ ఆ సినిమా అందుబాటులో ఉంది.


Also Read: వరుణ్ తేజ్ సూపర్ హిట్ సినిమాలు... ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?



ట్రిపుల్ ధమాకా... '24' ఎందులో ఉందో?
సూర్య క్లాస్ ఫిలిమ్స్, అలాగే మాస్ సినిమాలు చేశారు. అయితే, ఆయన్ను క్లాసీగా చూపించడంతో పాటు ఆయనలో విలనిజం చూపించిన సినిమా '24'. టిపికల్ స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్ చిత్రమిది. అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి క్లాసిక్ ఫిల్మ్ అందించిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సినిమా తెలుగు వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది. తమిళ్ వెర్షన్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


సెవెంత్ సెన్స్... హిందీ ఓటీటీ వేరు గానీ!
'గజినీ' తర్వాత సూర్య హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సినిమా '7ఏఎం అరివు'. తెలుగులో 'సెవెంత్ సెన్స్'గా డబ్బింగ్ చేశారు. విడుదలైన తర్వాత కొంత మిశ్రమ స్పందన లభించింది. కానీ, తర్వాత తర్వాత ఆడియన్స్ అంతా అప్రిషియేట్ చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ వెర్షన్స్ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. హిందీ డబ్బింగ్ 'చెన్నై వర్సెస్ చైనా' మాత్రం 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


Also Readఆహా ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ హారర్ మూవీస్ ఇవే... వీటిని అస్సలు మిస్ కావొద్దు



ఓటీటీలకు విజయాలు ఇచ్చిన సూర్య!
కరోనా కాలంలో వినోదం కోసం ఓటీటీల వైపు చూశారు ప్రేక్షకులు. ఆ సమయంలో చాలా సినిమాలు వచ్చినా... అందరి చేత అప్రిషియేషన్ అందుకున్న సినిమాలు కొన్నే. అందులోనూ అందరి చేత ప్రశంసలు అందుకున్నవి మరీ తక్కువ. ఆ లిస్టులో సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' (తమిళంలో 'సూరారై పొట్రు), 'జై భీమ్' ఉన్నాయి. ఆ రెండూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కరోనా టైంలో ఓటీటీలకు విజయాలు ఇచ్చిన హీరో సూర్య.


రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సూర్య నటించిన 'రక్త చరిత్ర 2' సైతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించిన సన్నివేశం నిడివి తక్కువే అయినా సరే... ఆయన కోసం 'విక్రమ్'ను మళ్లీ మళ్లీ చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఆ సినిమా జీ 5, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సింగం సిరీస్ సన్ నెక్స్ట్ ఓటీటీతో పాటు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.