Kanguva Star Cast Fees: సూర్యకు భారీ రెమ్యూనరేషన్... 'కంగువ' నటీనటుల్లో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ఎవరికో తెలుసా?

Kanguva Review Telugu: 'కంగువ' మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇందులో లీడ్ రోల్స్ పోషించిన సూర్య, బాబీ డియోల్, దిశా పటాని రెమ్యూనరేషన్ ఎంత అన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.

Continues below advertisement

కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya Sivakumar) హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'కంగువ'. మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా గురించే ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమాలో నటించినందుకు గాను సూర్యతో పాటు అందులో యాక్ట్ చేసిన సెలబ్రిటీలు ఎంత పారితోషకం తీసుకున్నారు? అనే వార్త బయటకు వచ్చింది. మరి ఈ మూవీ కోసం ఎవరెవరు ఎంత చార్జ్ చేశారో తెలుసా?

Continues below advertisement

భారతదేశంలోనే ఇప్పటి వరకు నిర్మితమైన అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో 'కంగువ' (Kanguva Movie) కూడా ఒకటి. ఈ సినిమా కోసం హీరో సూర్య ఏకంగా రూ. 39 కోట్లు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సూర్య గత సినిమాల బాక్సాఫీస్ పని తీరుతో పాటు ఇప్పుడున్న ఆయన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ మాత్రం వసూలు చేయడం సమంజసమే అనిపిస్తుంది. అలాగే దాదాపు రెండు మూడేళ్లు ఈ సినిమా కోసం ఆయన కష్టపడ్డాడు. 

'కంగువ' సినిమాలో సూర్య తరువాత చెప్పుకోవాల్సిన మరో స్టార్ బాబీ డియోల్. ఆయన 'యానిమల్' హిట్ తర్వాత మరోసారి జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక 'కంగువ' సినిమాలో బాబీ డియోల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఆయన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఆయనకు కూడా భారీగానే ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. బాబీ డియోల్ రూ. 5 కోట్ల పారితోషికాన్ని అందుకున్నాడని టాక్ నడుస్తోంది. తమిళంలో ఇదే ఆయనకు మొదటి మూవీ. ఇందులో క్రూరమైన విలన్ గా నటిస్తున్న బాబి డియోల్ పాత్ర ఇంట్రెస్టింగ్ గా, భయంకరంగా ఉంటుంది.

Read Also : Rashmika Mandanna: అల్లు అర్జున్‌కు రష్మిక స్పెషల్ గిఫ్ట్... అందులో వెండి కాయిన్ ఎందుకు పెట్టిందో తెలుసా?

ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని పారితోషికం విషయానికి వస్తే... దిశా పటానికి కూడా తమిళంలో ఇదే ఫస్ట్ మూవీ. 'కల్కి 2898 ఏడీ' తర్వాత ఈ బ్యూటీ మరో సౌత్ మూవీ 'కంగువ'లో కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె రూ. 3 కోట్ల పారితోషికాన్ని తన ఖాతాలో వేసుకున్నట్టుగా టాక్ నడుస్తోంది. మొత్తానికి మెయిన్ లీడ్స్ కోసమే నిర్మాతలు దాదాపుగా 50 కోట్ల దాకా బడ్జెట్ ఖర్చు పెట్టారని అర్థం అవుతుంది. ఇక నవంబర్ 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం దాదాపు 300 నుంచి 350 కోట్ల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కినట్టుగా సమాచారం.

ఇదిలా ఉండగా తమిళ చిత్రసీమ ఇప్పటిదాకా టచ్ చేయని 2000 కోట్ల బాక్సాఫీస్ మార్క్ ను 'కంగువా' సినిమా చేరుకుంటుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక చాలా రోజుల నుంచి స్వయంగా సూర్య 'కంగువా' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. సినిమాపై మంచి బజ్ ఉంది. ఇక ఇప్పటికే తమిళనాడు తో పాటు తెలుగు రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా స్పెషల్ షోలకు అనుమతి లభించింది. మరి సూర్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'కంగువా'కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ దక్కుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read Also : Kanguva: తమిళ తంబీల కంటే ముందే తెలుగు ప్రేక్షకులు 'కంగువ'ను చూడవచ్చు... ఎందుకో తెలుసా?

Continues below advertisement
Sponsored Links by Taboola