'ద కశ్మీర్ ఫైల్స్'... సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న సినిమా. ఇటువంటి చిత్రాలు మరిన్ని రావాలని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అప్పట్లో నిజాన్ని దాచి పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయని, ఇటువంటి చిత్రాల వల్ల ప్రజలకు నిజాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. సినిమాపై రాజకీయ పరంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


కశ్మీర్‌ లోయ నుంచి హిందువులు, ముఖ్యంగా అక్కడి పండిట్లపై జరిగిన దాడులు, కశ్మీర్ లోయ నుంచి వాళ్ళను తరిమికొట్టిన తీరును దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. పండిట్లపై కొందరు ముస్లిం తీవ్రవాదులు చేసిన దాడి ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. దీనిపై 'కుమారి 21ఎఫ్' ఫేమ్ హెబ్బా పటేల్‌ను నెటిజన్స్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.


''ఒకవేళ 'ద కశ్మీర్ ఫైల్స్'లో ఏదైనా పాత్రలో నటించే అవకాశం మీ చెంతకు వస్తే నటించేవారా?'' అని ఒక హెబ్బా పటేల్‌ను ఒకరు అడిగారు. అందుకు ఆమె 'నో' అని బదులు ఇచ్చారు. అవకాశం వచ్చినా 'ద కశ్మీర్ ఫైల్స్'లో నటించనని ఆమె స్పష్టంగా చెప్పారు. ''ఒకవేళ మీరు 'ద కశ్మీర్ ఫైల్స్'కు నో చెబితే... మీరు నిజాన్ని అంగీకరించే స్థితిలో లేరు'' అని మరొకరు హెబ్బా పటేల్‌తో అన్నారు. అందుకు ''ఎవరి అభిప్రాయం వాళ్ళది'' అని ఆమె బదులు ఇచ్చారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా హెబ్బా పటేల్ స్పందించారు. నిజం చెప్పాలంటే... ఆ ప్రశ్నలకు ఆమె అవాయిడ్ చేసి ఉండొచ్చు. కానీ, అలా చేయలేదు.
Also Read: ఓటీటీలో 'ది కశ్మీర్ ఫైల్స్' రిలీజ్ ఎప్పుడంటే?


హెబ్బా పటేల్ ముస్లిం. ఆ విషయాన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హెబ్బా ముస్లిం కావడంతోనే ఆమెను 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమా గురించి ప్రశ్నించారని ఊహించవచ్చు. విమర్శలు, ప్రశంసలు పక్కన పెడితే... వసూళ్ల పరంగా సినిమా దూసుకు వెళుతోంది. 


Also Read: 'ది కశ్మీర్ ఫైల్స్' కాంట్రవర్సీ, కపిల్ శర్మ ట్వీట్ పై అనుపమ్ ఖేర్ అసహనం