Bottle Radha OTT release date: మందు బాబుల కష్టాలను కళ్ళకు కట్టిన కామెడీ డ్రామా... ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

Bottle Radha OTT release : ప్రముఖ తమిళ దర్శకుడు పా రంజిత్ నిర్మాతగా తెరకెక్కించిన మూవీ 'బాటిల్ రాధ'. మందు బాబుల కష్టాలను కళ్ళకు కట్టిన ఈ కామెడీ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

Continues below advertisement

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రశంసలు అందుకున్న మందు బాబుల కామెడీ డ్రామా ఓటీటీలోకి రాబోతోంది. 'బాటిల్ రాధ' అనే టైటిల్ (Bottle Radha)తో రూపొందిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. 

Continues below advertisement

ఆహా ఓటీటీలోకి 'బాటిల్ రాధ'... ఎప్పుడంటే?
తమిళ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన పా రంజిత్ మరోవైపు నిర్మాతగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. మద్యపానం వల్ల ఎదురయ్యే సమస్యలు, అనర్ధాలను రియలిస్టిక్ గా 'బాటిల్ రాధ' మూవీతో తెరపైకి తీసుకొచ్చారు 'తంగలాన్' డైరెక్టర్ పా రంజిత్. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో సెటైరికల్ గా సోషల్ మెసేజ్ కూడా ఇచ్చారు. ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అన్న విషయాన్ని తాజాగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 

సోషల్ మీడియా వేదికగా 'బాటిల్ రాధ' పోస్టర్ ను పంచుకుంటూ ఫిబ్రవరి 21 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుందన్న విషయాన్ని వెల్లడించారు. ఇందులో గురుస్వామి సుందరం, సంచనా నటరాజన్ లీడ్ రోల్స్ పోషించారు. దినకరన్ శివలింగం దర్శకత్వం వహించగా, టిఎన్ అరుణ్ బాలాజీ, పా రంజిత్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. సీన్ రోల్డాన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చారు.

Also Readచావు సిగ్గుతో తలదించుకున్న వేళ... ఛత్రపతి శంభాజీ మహారాజును ఔరంగజేబు ఎంత దారుణంగా చంపించాడంటే?

'బాటిల్ రాధ' స్టోరీ ఇదే 
హీరో రాధా మణి ఒక మేస్త్రీ. కూలీ పనులు చేస్తూ సంపాదించిన డబ్బులను తాగడానికి, జల్సాల కోసమే ఖర్చు చేస్తాడు. కుటుంబం అంటే ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ తాగుడుకు బానిసై, కుటుంబాన్ని సమస్యల్లోకి నెట్టేస్తాడు. భర్త తాగుడు వల్ల అంజలామ్ ఎన్నో ఇబ్బందులు పడుతూనే, అతనిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. భర్తకు తెలియకుండానే అతన్ని రీహాబిలిటేషన్ సెంటర్లో చేరుస్తుంది. కానీ అక్కడ నుంచి కూడా రాధా పారిపోతాడు. మరి రాధా ఆ తర్వాత ఎలాంటి సమస్యల్లో పడ్డాడు? భార్య పిల్లల కోసం తాగుడుకు దూరమయ్యాడా లేదా? చివరికి ఈ ఫ్యామిలీ సంతోషంగా కలిసి ఉందా? అనేది బాటిల్ రాధా స్టోరీ. ఈ మూవీ షూటింగ్ 2013లోనే ఫినిష్ కాగా, పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ అయ్యి, ప్రశంసలు అందుకుంది. జనవరి 24న రిలీజ్ అయిన ఈ మూవీ కమర్షియల్ గా మాత్రం హిట్ కాలేదు. 

కాగా పా రంజిత్ దర్శకుడిగా గత ఏడాది విక్రమ్ హీరోగా 'తంగలాన్' అనే హిస్టారికల్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. కానీ ఈ మూవీ కమర్షియల్ గా విజయాన్ని సాధించలేదు. 

Also Readసాంబార్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు, సాంబార్‌కు సంబంధం ఏంటి?

Continues below advertisement