Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ మిధునని వెంటనే తీసుకురమ్మని ముఖర్జీని కంగారు పెడుతుందని ముఖర్జీ మహాలక్ష్మీతో నిజం చెప్పేయాలి అనుకుంటారు. సీతని కాపాడటానికి మహాలక్ష్మీతో సీత, మిధున ఒక్కరే అని చెప్పాలి అనుకుంటారు. సీత తనని విడిపించమని అంటుంది. కావాలనే రౌడీలను రెచ్చ గొడుతుంది. ఓ రౌడీ రెచ్చిపోతుంటే మరో రౌడీ ఆపుతాడు. తాను బందీ అయినట్లు సీత ఎవరికైనా చెప్పాలి అనుకుంటుంది.
రేవతి రామ్‌తో సీత గురించి ఇంకా తెలీలేదు పోలీస్ కంప్లైంట్ ఇద్దామని సీత తండ్రికి ఫోన్ చేయమని అంటారు. కాసేపు చూసి ఏసీపీ కాల్ చేసి రిపోర్ట్ ఇస్తానని రామ్ అంటాడు. ఈ రోజు సాయంత్రం వరకు మీకు సీత గురించి ఏం తెలీదు అని మహాలక్ష్మీ అంటుంది. ఇక పంతులు టైం అయిపోతుందని కంగారు పెడుతుంది. గౌతమ్ మిధునకు కాల్ చేస్తా అన్న టైంకి ముఖర్జీ వస్తారు. మిధున ఎక్కడుందని గౌతమ్ అడుగుతాడు. ముఖర్జీ తడబడతాడు.
మహాలక్ష్మీ: ఏమైంది సార్ మిధున మీతో రాలేదా. ఏంటండి ఇబ్బందిగా ఉన్నారు ఏమైనా సమస్యనా.ముఖర్జీ: మిధున.. మిధున.. సుశీల: మిధున కనిపించడం లేదండీ.చలపతి: వీడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అమెరికా చెక్కేసిందేమో.మహాలక్ష్మీ: మిధున ఎక్కడికి వెళ్లింది.ముఖర్జీ: అదే తెలీదు.గిరి: మీకు చెప్పకుండా మిధున ఏం చేయదు కదా. అర్చన: ఇక్కడ సీత అక్కడ మిధున ఒకేలా ఉన్న ఇద్దరు ఒకేసారి కనిపించకుండా పోవడం ఏంటి. ఏదో తేడాగా ఉంది మహా.మహాలక్ష్మీ: నాకు అలాగే అనిపిస్తుంది. నిజం చెప్పండి ముఖర్జీ గారు మిధున మీ అమ్మాయేనా లేక సీతే మిధునలా నటిస్తుందా నాకు నిజం తెలియాలి ముఖర్జీ గారు. రేవతి వాళ్లు, మీరు, సీత కలిసి నాటకం ఆడుతున్నారని నాకు అనుమానంగా ఉంది. మర్యాదగా నాకు నిజం చెప్పండి.జనా: ఏంటి సార్ మౌనంగా ఉన్నారు. సీత మిధునలా నటిస్తుందా.సుశీల: మీ దగ్గర నిజం చెప్పాలి అనే వచ్చాం.
ముఖర్జీ సీత, మిధున ఒక్కరే అని చెప్పబోతారు. సీత, మిధున ఒక్కరేనా అని మహాలక్ష్మీ అరుస్తుంది. దాంతో సీత మిధునలా నిశ్చితార్థానికి రెడీ అయి ఇద్దరూ ఒక్కరు కాదు అని చెప్పి ఎంట్రీ ఇస్తుంది. నేను రావడం కాస్త లేటు అయ్యే సరికి నేను సీత ఒక్కరే అయిపోతారా అని అంటుంది. సీతతో నాకు పోలిక ఏంటి అని మిధున అంటే దానికి సీతకు నీకు పోలిక ఏంటి నువ్వు సీతలా ఉండాలి అంటే ఇంకో జన్మ ఎత్తాలి అంటాడు. ఇక అందరూ కార్యక్రమం మొదలు పెడదామని అనుకుంటారు. మహాలక్ష్మీ గౌతమ్‌ని చాటుగా తీసుకెళ్లి రౌడీలకు కాల్ చేయమని చెప్తుంది. రౌడీలకు ఫోన్ చేసి సీత ఉందో లేదో కనుక్కోమని అంటుంది.
గౌతమ్ రౌడీలకు కాల్ చేస్తాడు. రౌడీలు సీత ఉందని అంటారు. గౌతమ్, మహాలక్ష్మీ రిలాక్స్ అయపోతారు. అయితే సీత తండ్రి రౌడీలకు గన్ గురి పెట్టడంతో రౌడీలు సీత ఉందని అబద్ధం చెప్తారు. నేను ఇక్కడికి ఎలా వచ్చానో మీకు తెలుసా అని శివకృష్ణ అడుగుతాడు. ఫ్లాష్ బ్యాక్‌లో సీత కాలితో ఫోన్ తీసుకొని వాట్సాప్‌లో తండ్రికి లొకేషన్ పెడుతుంది. తర్వాత వాయిస్ కాల్ చేసి సిగ్నిల్ ఇస్తుంది. సీత ప్రమాదంలో ఉందని గ్రహించి శివకృష్ణ వెళ్తాడు. ఇంతలో సీత కట్లు విప్పుకొని రౌడీలను కొట్టి పారిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: రత్నమాలకు పక్షవాతం.. గిరి మారిపోయాడా.. త్రిపుర పెళ్లికి ఒప్పుకుంటుందా!