Prema Entha Madhuram Serial Today Episode: సన్యాసి వేషం వేసుకుని యాదగిరి గుడికి వచ్చిన అభయ్‌ని పలకరిస్తాడు. నీ మనసులో ఉన్న అలజడి మాకు తెలుసు అని చెప్తాడు. దీంతో అభయ్‌ ఎవరు స్వామి మీరు అని అడగ్గానే..

యాదగిరి: సాధు పుంగవులం.. భూత భవిష్యత్తు వర్తమానం కాలాలు తెలిసిన వాళ్లము. నీ గురించ మాకు తెలుసు చెప్పమందువా..?

చిన్నొడు: ఆహా మహానుభావ నీ దర్శన భాగ్యం ఇన్నాళ్లకు దొరికిందా..?

పెద్దొడు: ఈయన యారి బాబా అని రీసెంట్‌గా హిమాలయాల నుంచి దారి తప్పి  వచ్చారు. గొప్ప సాధువు. స్వామి మీతో మా కష్టాలు చెప్పుకోవాలి ఇలా రండి స్వామి

అంటూ పక్కకు తీసుకెళ్తారు. నువ్వు అప్పుడే ఎందుకు వచ్చావు బాబాయ్‌ అని అడుగుతారు. నీ ఎంట్రీ ఎప్పుడనేది మేము చెప్తాము కదా..? నిజం తెలిస్తే మనకు ప్రమాదం ఉంటుంది బాబాయ్‌ అని చెప్తారు. ఇంతలో అభయ్‌ ప్రదిక్షణ చేస్తుంటే మెట్లకు పూజ చేస్తున్న మాయ కనిపిస్తుంది.

అభయ్‌: నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. ఇల్లు వదిలి వెళ్లిపోమ్మని చెప్పినా కూడా నన్ను ఇంకా ఫాలో అవుతున్నావా..? బుద్ది లేదా నీకు. నన్ను ఇంకా మోసం చేయడానికి మళ్లీ ఇంకో ప్లాన్‌తో వచ్చావా..?

శంకర్‌: అభయ్‌ ఏంటి ఎవరి మీద కేకలు వేస్తున్నావు.

అభయ్‌: అకి ఇందుకేనా నువ్వు నన్ను పట్టుబట్టి గుడికి తీసుకొచ్చింది. తను ఇక్కడికి వస్తుందని నీకు ముందే తెలుసు కదా..?

అకి: ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నయ్య..ఎవరొచ్చారు..?

అభయ్‌: ఇంకెవరు ఆ మాయ.. అదిగో..

అని అభయ్‌ చూడగానే అక్కడ వేరే అమ్మాయి ఉంటుంది. శంకర్‌ సైగ చేయగానే మాయ అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే అమ్మాయి వచ్చి ఉంటుంది.

అకి: అక్కడ మాయ ఎక్కడ ఉంది అన్నయ్య.. అక్కడుంది వేరే అమ్మాయి కదా..?

అభయ్: లేదు అకి నేను చూశాను.

శంకర్‌: అరే తను ఉంటే మాకు కూడా కనిపించాలి కదా అభయ్‌.

అభయ్‌: లేదు శంకర్‌ గారు నేను క్లియర్‌గా చూశాను. ఇందాక ఇక్కడుంది మాయే..

చిన్నొడు: ఏంటి అన్నయ్యా ఏమైంది.

శంకర్‌: ఏం లేదురా నేను గౌరి గారిని మిస్‌ అవుతున్నట్లే అభయ్‌ కూడా మాయను బాగా మిస్‌ అవుతున్నాడనుకుంటా.. ఎవరో అమ్మాయి చూసి మాయ అనుకుంటున్నాడు.

పెద్దొడు: అవునా అయితే మాయ కూడా అభయ్‌ గురించే ఆలోచిస్తుందేమో..?

అకి: అయితే తన ఫీలింగ్‌ ట్రూ అన్నమాట.

రవి: అందుకే కదా మాయలా కనిపించింది.

అభయ్‌: బావ అదేం లేదు ఇది జస్ట్‌ కో ఇన్సిడెంట్‌ అంతే.. వదిలేయండి. ఇక్కడ ఎవరికి ఎవరి మీద ఫీలింగ్స్‌ లేవు.

అంటూ అభయ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రవి వాళ్లను అభయ్ తో వెళ్లమని శంకర్‌ తాను మాయతో మాట్లాడి వస్తామని చెప్తుంది అకి. దీంతో రవి వాళ్లు అభయ్‌ వెంట వెళ్లిపోతారు. శంకర్‌, అకి ఇద్దరూ కలిసి మాయ దగ్గరకు వెళ్తారు.

శంకర్‌: మాయ మన ఫస్ట్‌ ప్లాన్‌ సక్సెస్‌…

అకి: ఆ కన్నీల్లేంటి..? ఎందుకు ఏడుస్తున్నావు.

మాయ: అభయ్‌ నన్ను ఎంత ద్వేషిస్తున్నాడో తన మాటలు వింటేనే అర్థం అవుతుంది. అసలు తను నన్ను క్షమిస్తాడా..?

శంకర్‌: నువ్వేం డీలా పడుక మాయ అంతా పాజిటివ్‌గానే జరుగుతుంది. అకి తనకు నచ్చజెప్పు

అకి: బాధపడకు మాయ శంకర్‌ గారు చెప్తున్నారు కదా..? మమ్మల్ని నమ్ము..

శంకర్‌: నెక్ట్స్‌ ప్లాన్‌ బీ నువ్వు రెడీ ఉండు మాయ.

అని చెప్పగానే సరే అంటుంది మాయ. ఇంతలో ఆటోలో గౌరి, సంధ్య, శ్రావణి గుడికి వస్తారు. వాళ్లను చూసిన శంకర్‌ స్టైలిష్‌గా రెడీ అయి దగ్గరకు వచ్చి గౌరికి సన్‌ గ్లాసెస్‌ ఇస్తాడు. శ్రావణి మాత్రం కోప్పడుతుంది. ఇద్దరిని తిడుతుంది. దీంతో గౌరి, శంకర్‌ను తిట్టినట్టి యాక్ట్‌ చేస్తుంది. తర్వాత అందరూ కలిసి మాయ, అభయ్‌ని కలపాలని వెళ్తారు. ఎవరు ఎంత చెప్పినా అభయ్‌ వినడు దీంతో మాయ వచ్చి ఏడుస్తూ నా కర్మ నేను అనుభవిస్తాను. నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అంటుంది. దీంతో అభయ్‌ కోపంగా అయితే నువ్వు మంచి అమ్మాయివి కాదా అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో మాయ ఆత్రుతగా అయితే నువ్వు నన్ను ప్రేమించావా అని అడుగుతుంది. దీంతో అభయ్‌ వర్దన్‌ ఫ్యామిలీకి ప్రేమించడమే తెలుసు..ధ్వేషించడం తెలియదు అంటాడు. దీంతో మాయ, అభయ్‌ని హగ్‌ చేసుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!