Nuvvunte Naa Jathaga Serial Today Episode శారద లలితతో తన కొడుకు మిధునని బాగా చూసుకుంటాడు త్వరలోనే మారిపోతాడని చెప్తుంది. శారద, లలిత మాట్లాడుకోవడం చూసిన జడ్జి హరివర్దన్ భార్యని పిలుస్తాడు. వాళ్లతో మాటలేంటి అసహ్యంగా అని తిడతాడు. ఇంతలో సత్యమూర్తి అక్కడికి వస్తారు.
హరివర్దన్: సత్యమూర్తి మీరు పైకి మంచి వాళ్లలా నీటి వాక్యాలు చెప్పి లోపల ముంచే వాళ్లని మరోసారి నిరూపించారు.
సత్యమూర్తి: సార్ మోసం అనేది ఈ సత్యమూర్తి రక్తంలోనే లేదు. దయచేసి కాస్త పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది.
హరివర్దన్: డబ్బు కోసం బంగారం లాంటి భవిష్యత్ ఉన్న ఆడపిల్లల గొంతు కోసే మీలాంటి వాళ్లకి మర్యాద ఇవ్వడం ఏంటయ్యా.
సత్యమూర్తి: హరివర్దన్ గారు.
హరివర్దన్: ఏయ్ అవును. మా ముందు మీ అమ్మాయిని మీరు తీసుకెళ్లండి అంటున్నారు కానీ ఇందాక మీ అబ్బాయి భార్యగా నా కూతురి పేరు చెప్పారు. దీని బట్టే అర్థమవుతుంది మీ నాటకాలు.
సత్యమూర్తి: సారీ అండీ నా భార్య తెలీక ఆ పేరుని.
హరివర్దన్: ఏయ్ వద్దయ్యా డ్రామాలు వద్దు. మీ నిజస్వరూపం తెలిసింది. నా దగ్గర మీ నాటకాలు పనికిరావు. చూడు నా కూతురి ఈ కోడలు అయిపోయింది నా ఆస్తి కొట్టేయొచ్చని పగటి కలలు కంటున్నావేమో.
సత్యమూర్తి: ప్రాణం పోయినా అలాంటి వాటి కోసం ఈ సత్యమూర్తి ఆశపడదు.
హరివర్దన్: నా కూతురి మెడలో తాళి కట్టి తన భవిష్యత్‌తో ఆడుకున్న నీ కొడుకుతో పాటు మీ కుటుంబం అంతు చూస్తాను. విత్ ఇన్ షార్ట్ పిరియడ్‌లో నా కూతుర్ని నా ఇంటికి తెచ్చుకుంటా చూస్తూ ఉండండి.
సత్యమూర్తి: చూశావు కదా కోడలిగా తన పేరు చెప్పడం వల్ల ఎలాంటి మాటలు పడ్డామో. నీకు తను కోడలు అని ఉద్దేశం ఉంటే ఈ క్షణమే చంపేసుకో ఎందుకంటే ఆ అమ్మాయి ఎప్పటికీ వెళ్లాల్సింది ఆ ఇంటికి. ఆ అమ్మాయి చదువు స్థాయికి నీ రౌడీ కొడుకు ఎప్పటికీ సరి తూగదు.
దేవా బట్టలు కొని వాటిని పట్టుకొని కష్టపడి సంపాదించిన డబ్బుతో మీకు బట్టలు కొనడం నాకు చాలా సంతోషంగా ఉందని అనుకుంటాడు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం రంగం లెటర్ రాస్తుంటే అమ్మాయికి రాస్తున్నాడు అనుకొని కాంతం రంగాన్ని చితక్కొడుతుంది. ఇంతలో శారద వాళ్లు గుడి నుంచి వస్తారు. శారద ఇద్దరు కోడళ్లకు కుంకుమ పెడుతుంది. మిధునకు పెట్టబోతే కాంతం ఆపి మామయ్య గారు ఉన్నారు అంటుంది. దాంతో శారద బొట్ట పెట్టకుండా ఆగిపోతుంది. ఇక కాంతానికి పువ్వుల దండ ఇచ్చి మూడు ముక్కలు చేసి తీసుకురమ్మని అంటుంది. తర్వాత మిధునకు సైగలు చేసి సారీ చెప్తుంది. తర్వాత మిధునకు సైగ చేసి పక్కకి పిలుస్తుంది. ఎవరూ చూడకుండా బొట్టు పెడుతుంది. కాంతం వచ్చి ఏదో జరిగిందే అంటే ఇద్దరూ ఏం జరగలేదే అని అంటారు. ఆ సీన్ కామెడీగా ఉంటుంది. కాంతం బొట్టు నీకు ఎక్కడిది అంటే ఉదయం పెట్టుకున్నా అంటుంది. ఇక కాంతం పువ్వుల దండ శారదకు ఇస్తే శారద ఎవరూ చూడకుండా మిధునకు ఇస్తుంది. మిధున దాచేస్తుంది. కాంతం వచ్చి ఏదో జరిగింది అంటే ఏం లేదే అనేస్తారు. ఇద్దరూ నవ్వుకుంటారు. ఏదో జరుగుతుందే అని కాంతం వెళ్తుంది.
దేవా బట్టల బ్యాగ్ తీసుకొని ఇంటికి వస్తాడు. తండ్రి దగ్గరకు వెళ్లి నాన్న మీ కోసం మళ్లీ బట్టలు తీసుకొచ్చానని అంటాడు. నీ రక్తపు సంపాదనతో తీసుకొచ్చిన బట్టలు నాకు అవసరం లేదు అని ఇది వరకే చెప్పాను కదా అంటాడు. దేవా వాటిని కష్టపడి తెచ్చానని చెప్పక ముందే వాటిని సత్యమూర్తి విసిరేసి వెళ్లిపోతాడు. అందరూ బాధ పడతారు. దేవా వాటిని తీసి పట్టుకుంటాడు. దేవా చేతి గాయాలు చూసి శారద ఏమైందని అడుగుతుంది. మీ కోసం కష్టపడి పని చేస్తే గాయాలు అయ్యావని చెప్తాడు. రౌడీగా పని చేసి తీసుకొస్తే వద్దు అన్నారని నలుగురు చేయాల్సిన పని ఒక్కడినే చేసి మీ కోసం బట్టలు తీసుకొచ్చా కానీ ఈ విషయం చెప్పే అవకాశం నాన్న నాకు ఇవ్వలేదని అంటాడు. ఆయన మాట కాదని నువ్వు కూడా ఈ బట్టలు తీసుకోవు కదా అమ్మా అంటే నేను తీసుకుంటారా నువ్వు ఇంత కష్టపడి తీసుకొస్తే ఎందుకు తీసుకోనురా అని తీసుకుంటుంది. శారద ఏడుస్తుంది. బ్యాగ్ పట్టుకొని ఎమోషనల్ అవుతుంది.
మిధున దేవా దగ్గరకు వెళ్లి చేతి గాయానికి మందు రాస్తాను అంటుంది. గుండెలో ఉన్న నొప్పి కంటే ఇది పెద్ద నొప్పి కాదని అంటాడు. నేను కష్టపడి పని చేసి బట్టలు తీసుకొచ్చినా మా నాన్న తీసుకోలేదు బాధగా ఉండదా అంటాడు. మా నాన్నకి నేను అంటే అసహ్యం అని చెప్పినా వినకుండా నన్ను రెచ్చగొట్టి తీసుకొచ్చేలా చేశావ్ నీ మాట విని తీసుకొచ్చినందుకు వాటిని మా నాన్న నా ముఖం మీద విసిరారు. నన్ను తిట్టించాలి అనే నువ్వు ఇలా చేశావని తెలిసి కూడా నేను నీ మాట విన్నందుకు నాకు బాగా అయింది అంటాడు. ఇప్పుడు నేను చెప్తా విను అని మిధున అంటుంది. మొదటి సారి మీ అమ్మానాన్నలు తీసుకోలేదు కానీ ఇప్పుడు మీ అమ్మ తీసుకున్నారు కదా అది నీకు ఎంతో కొంత సంతోషమే కదా. ఇక మీ నాన్న గారికి నీ మీద ద్వేషం లేదు నీ జీవితం ఏమైపోతుందా అనే బాధ ఎన్నో ఏళ్లగా ఉన్న బాధ అది ఇంత చిన్న టైంలో ఎలా పోతుంది. టైం పడుతుంది. అందరి ముందు కోప్పడినా మీ నాన్న లోపల చాలా పొంగిపోయింటారు. కచ్చితంగా నిన్ను త్వరలోనే అర్థం చేసుకుంటారు. తన దగ్గరకు తీసుకొని దగ్గరకు తీసుకుంటారు. నువ్వు ఆవేశ పడకుండా నువ్వేం చేస్తే మీ నాన్న నిన్ను అర్థం చేసుకుంటారో అది చేయ్ అని చెప్పి చేతికి మందు రాస్తుంది. శారద కొడుకు తీసుకొచ్చిన చీర కట్టుకొని బయటకు వస్తుంది. మిధున చాలా సంతోషపడుతుంది. సూపర్ అని సైగ చేస్తుంది. దానికి శారద మా పెళ్లి రోజున నువ్వు మాకు మర్చిపోలేని బహుమతి ఇచ్చావ్ అని మిధునని ముద్దాడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: రత్నమాలకు పక్షవాతం.. గిరి మారిపోయాడా.. త్రిపుర పెళ్లికి ఒప్పుకుంటుందా!