Nindu Noorella Saavasam Serial Today Episode: అనామికను పరీక్షంచేందుకు చిత్ర వివిధ రకాలుగా మాట్లాడుతుంది. తన గురించి పూర్తిగా తెలుసుకోవాలని అన్ని విషయాలు అడుగుతుంది. అనామిక మాత్రం ఓపికగా చిత్రకు చెప్తుంది.
అనామిక: చిత్ర ఎందుకు నాతో ఇంతసేపు మాట్లాడుతుంది. మనుకు నా మీద అనుమానం వచ్చి నిజాన్ని కనిపెట్టమని చిత్రను పంపించిందా..? ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. (మనసులో అనుకుంటుంది)
చిత్ర: అనామిక చెప్పు మీ ఊరు ఏ ఊరు
అనామిక: ఈ ఊరు కాదు
చిత్ర: అనామిక అదే ఏ ఊరో చెప్పు
అనామిక: అంటే ఈ ఊరు కానప్పుడు మా ఊరు ఏంటో తెలియనప్పుడు ఇంక నా ఊరు గురించి తెలుసుకుని ఏం చేస్తారు అంతే కదా
చిత్ర: మరి నువ్వు ఏ కాలేజీలో చదువుకున్నావో అదైనా చెప్తావా..?
అనామిక: ఓ చెప్తాను ఎందుకు చెప్పను
ఇంతలో అనామిక వాళ్ల అన్న, వదిన వస్తుంటారు. దూరం నుంచి చిత్ర, అనామికలను చూస్తుంది మనోహరి.
మను: అది అనామికనో.. అరుంధతియే కనిపెట్టడం చిత్ర వల్ల కాదు. ఆ బాబ్జీ గాడు వచ్చాడేమో చూసి కనీసం భాగీ పనైనా ఫినిష్ చేస్తాను
చిత్ర: ఒక్క నిమిషం ఆగు అసలు నువ్వు ఏం చదువుకున్నావో చెప్పడానికి ఇండియాకు స్వాతంత్రం రావడానికి అసలు ఏంటి సంబంధం
అనామిక: సంబంధం ఉంది చిత్ర నువ్వు మొత్తం వింటేనే కదా తెలుస్తుంది. అప్పుడు బ్రిటిషర్స్‌కు
చిత్ర: వద్దు నువ్వు చెప్పే సోది వినడం కంటే.. అదిగో అక్కడ సీతారాముల కథ చెప్తున్నారు అది వింటే నాకు పుణ్యమైన వస్తుంది ఓకే
అనామిక: అవును పుణ్యం వస్తుంది. కానీ నా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా..? మరి నా గురించి తెలియాలంటే..? నేను చెప్పిందే కదా వినాలి
చిత్ర: ఏంటి.? నువ్వు నీ గురించి చెప్తున్నాను అనుకుంటున్నావా..?
అనామిక: అవును
చిత్ర: నీకో దండం బై
అనామిక బ్రదర్: అనామిక ఎలా ఉన్నావు అమ్మా.. ఇంట్లోంచి పోయిన సంది నువ్వు ఎట్లున్నవో అని ఎంత కంగారు పడినమో తెలుసా
చిత్ర: వాళ్లు అంత ప్రేమగా మాట్లాడుతుంటే పరిచయం లేన్నట్టు చూస్తుందంటే.. ఇది కచ్చితంగా అరుంధతియే (మనసులో అనుకుంటుంది)
అనామిక: అయ్యో వీళ్లు ఎవరో అనామికకు తెలిసిన వాళ్లలా ఉన్నారు. వీళ్లు అనామికకు ఏమౌతారో ఏంటో..? ఎలా పలకరించాలో ఏంటో ఏం తెలియడం లేదే (మనసులో అనుకుంటుంది)
వదిన: ఏంది మీ అన్న మాట్లాడుతూనే ఉన్నడు. నువ్వేంది పలకకుండా బొమ్మ లెక్క నిల్చున్నావు
అనామిక: నేను బాగానే ఉన్నాను అన్నా నువ్వెలా ఉన్నావు.. ఎలా ఉన్నావు వదిన
వదిన: అదేంటి కొత్తగా నా బాగోగుల గురించి అడుగుతున్నావు
అనామిక బ్రదర్: అదేం మాట్లాడినా వంకలు పెడతావేంటి..? మీ వదిన మాటలకేం కానీ కేర్ టేకర్ గా వద్దంటే పోయినవ్ అక్కడ అంతా బాగానే ఉందా..?
అనామిక: బాగానే ఉంది అన్న
అనామిక బ్రదర్: సరే కళ్యాణం అయినాక ఇంటికి పోదాం.. పండగ అయినాక రేపు డ్యూటికీ పోదువు సరేనా
అనామిక: నేను పిల్లలను చూసుకోవాలి. నేను ఇప్పుడు రాలేను
వదిన: అదేంటో నీ పిల్లలను చూసుకోవాలి అన్నట్టు చెప్తున్నావు
అనగానే అనామిక నాకు పనుంది వెళ్తున్నాను తర్వాత కలుస్తాను అంటూ వెళ్లిపోతుంది. అంతా గమనించిన చిత్ర ఇది కచ్చితంగా అరుంధతియే అని మనోహరి దగ్గరకు పరుగెత్తుకెళ్లి నిజం చెప్తుంది. మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో సన్యాసుల వేషంలో వచ్చిన బాబ్జీ వాళ్లు భాగీని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటారు. మరోవైపు అమర్, భాగీ కోసం వెతుకుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!