Ammayi garu Serial Today Episode విరూపాక్షి బోనులోకి వచ్చి ఈ కేసుకి సూర్యప్రతాప్‌ భార్య అయినా నాకు ఏం సంబంధం లేదు అయినా నన్ను ఇందులోకి లాగుతున్నారని విరూపాక్షి అంటుంది. దానికి పీపీ సూర్యప్రతాప్‌ మానసిక స్థితి గురించి చెప్పాను ఆయనకు కోపం వస్తే భార్య అని చూడరు.. కూతురని చూడరు.. అక్క అని చూడరు అలాంటిది దారిన పోయిన రాధికను ఎలా వదిలేస్తారని  అంటారు.

రాధిక ప్రాణాలతో లేదు కాబట్టి ఉన్న ఆధారాలతో తీర్పు ఇవ్వమని కోరుతారు. జడ్జి వీడియోల ఆధారంగా సూర్యప్రతాప్‌ది తప్పు అని రాధికను కూడా సూర్యప్రతాప్‌ చంపారని కోర్టు నమ్మి సూర్యప్రతాప్‌ని దోషిగా నిర్ణయిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నామని చెప్పబోతు ఉంటే రూప ఆపుతుంది. రూప బోనులోకి వచ్చి రాధిక చనిపోయింది అన్నారు కానీ రిపోర్ట్ ఇవ్వలేదు కదా అని ఒక్క నిమిషం టైం అడుగుతుంది. జడ్జి సరే అనడంతో రాజు బయటకు వెళ్తాడు.

రాజు బయటకు వెళ్లి రాధికను తీసుకొని కోర్టు లోపలికి వస్తారు. రాధికను చూసి అందరూ షాక్ అవుతారు. చచ్చిపోయింది ఎలా బతికిందని దీపక్, విజయాంబిక తల పట్టుకుంటారు. తమ పేరు చెప్తుందేమో అని భయపడతారు. రూప ఆమెను చూపించి పీపీ చనిపోయిందని చెప్పిన రాధిక ఈవిడే అని రూప చెప్తుంది. రాధిక మీద హత్యాప్రయత్నం జరిగిందని కారులో ఉందని తనే అని కానీ సజీవ దహనం అయిపోకుండా బయట పడిందని రాజు జడ్జికి చెప్తారు. కారు కాలిపోయినప్పుడు రాధికను ఇద్దరు యువకులు కాపాడుతారు. 

రాధిక బోనులోకి వెళ్లి సూర్యప్రతాప్ రాజకీయ నాయకుడిగా చాలా ఏళ్లగా తెలుసు కానీ పరిచయం మాత్రం ఇటీవల జరిగిందని చెప్తుంది. సూర్యప్రతాప్‌   తనని బలవంతం చేయలేదని డబ్బుకి ఆశపడి తానే ఆయన మీద నింద వేశానని రాధిక చెప్తుంది. రూప, విరూపాక్షి, రాజులు చాలా సంతోష పడతారు. తాను చేసిన తప్పునకు దేవుడు శిక్ష వేశాడని ప్రాణం పోయే టైంకి దేవుడే మరో అవకాశం ఇచ్చాడని అందుకే తప్పుని సరిదిద్దుకుంటున్నానని చెప్తుంది. నిన్ను ఎవరు చంపాలి అని చూశారని జడ్జి అడిగితే సూర్యప్రతాప్‌ని అవమానించి సీఎం కుర్చీ నుంచి దించాలని బేరం చేసిన వాళ్లే  తనని చంపాలని ప్రయత్నించారని అతను మాజీ సీఎం కొడుకు జీవన్ అని రాధిక చెప్పేస్తుంది. ఆయనతో పాటు సూర్యప్రతాప్‌ నాశనం కోరుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారని విజయాంబిక, దీపక్‌లను చూస్తుంది. ఇద్దరూ చెమటలు పట్టేస్తారు. కానీ రాధిక వాళ్ల పేర్లు చెప్పదు. తాను చేసిన తప్పునకు ఏ శిక్ష వేసినా భరిస్తానని కానీ జీవన్‌ని ఉరి తీయండి అని చెప్తుంది. తాను అప్రూవర్‌గా మారుతా అన్నందుకే తన కారుకి పెట్రోల్ పోసి కాల్చేశాడని చెప్తుంది.

రాజు రూపలు జీవన్‌ని కలిసి వెళ్లినప్పుడు రాధికను కాపాడి హాస్పిటల్‌లో చేర్చిన యువకులు రాధిక హాస్పిటల్‌ బిల్ కోసం రింగ్ ఇస్తుంది. వాళ్ల దగ్గర రూప ఆ రింగ్ చూసి అది తన తల్లిదని గుర్తిస్తుంది. ఆ రింగ్ రాధిక సూర్యప్రతాప్‌ మీద నింద వేయడానికి వాడిందని గుర్తించి వాళ్లకి విషయం అడిగి తెలుసుకుంటారు. రాధిక హాస్పిటల్‌లో ఉందని తెలుసుకొని హాస్పిటల్‌కి వెళ్తారు. రాధిక వాళ్లకి విషయం చెప్తుంది. నాకు ఆస్తి ఏం అక్కర్లేదు నేను నిజం చెప్తానని రాధిక అంటుంది. కోర్టులో రాధిక తనని రాజు, రూపలు కాపాడారని చెప్తుంది. ఇక జడ్జి పీపీని మందలిస్తారు. రాధికకు 20 వేల రూపాయల జరిమానా విధిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: రత్నమాలకు పక్షవాతం.. గిరి మారిపోయాడా.. త్రిపుర పెళ్లికి ఒప్పుకుంటుందా!