Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ ఓవైపు వివేక్, జానులు మరోవైపు పిల్లల కోసం లొకేషన్‌కి వెళ్తుంటారు. మంత్రగత్తె పాముని మిత్ర గది వైపు విడిచి పెడుతుంది. ఇక సరయు పిల్లలు బ్యాగ్‌లు చెక్ చేసి అందులో లైవ్‌ లొకేషన్ చూసి షాక్ అవుతుంది. లక్ష్మీ తమని ఫాలో అవుతుందని తెలుసుకొని బ్యాగ్‌లు విసిరేసి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని వెళ్లిపోతుంది.

లక్ష్మీ లొకేషన్‌కి వస్తుంది. పిల్లల బ్యాగ్‌లు పడి ఉండటం చూసి ఏడుస్తుంది. పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లారు నేను ఆయనకు ఏం సమాధానం చెప్పాలి అని ఏడుస్తుంది. మనీషా మిత్ర కోసం జ్యూస్ తీసుకెళ్తుంది. అత్తయ్య పంపారని చెప్పి ఇస్తుంది. అదే టైంలో పాము గదిలోకి వెళ్లి మంచం దగ్గర పడగ విప్పి కాచుకు ఉంటుంది. ఇక మిత్ర లక్ష్మీకి ఒక సారి కాల్ చేస్తానని చెప్పి మనీషాకి జ్యూస్ ఇస్తాడు. మనీషా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లక్ష్మీ మిత్రకు విషయం  చెప్పదు. ఏం ప్రాబ్లమ్ లేదండి నేను చూసుకుంటా అని కొంగు నోటికి అడ్డు పెట్టుకొని ఏడుస్తుంది.   

లక్కీ, జున్నులను ఓ గదిలో బందిస్తారు. రౌడీలను చూసి పిల్లలు భయపడతారు. రౌడీలు లక్కీ, జున్నులతో మేం మిమల్ని కిడ్నాప్ చేశామని చెప్తారు. ఇంటికి వెళ్లాలి అని పిల్లలు ఏడుస్తారు. లక్కీ, జున్నులు రౌడీల ఫోన్ కొట్టేయాలి అని ప్లాన్ వేస్తారు. జున్ను ఎక్కిళ్లు వచ్చినట్లు నటిస్తాడు. లక్కీ రౌడీని పిలిచి వాటర్ అడుగుతుంది. జున్ను వాటర్ తాగి ఆయన మీద ఊసేస్తాడు. దాంతో రౌడీ షర్ట్ తీసి అక్కడ పెట్టేసి వెళ్లిపోతాడు. దాంతో లక్కీ జేబులో ఉన్న ఫోన్ తీసుకుంటుంది.  

మిత్రకు పాము కాటేయడానికి వచ్చినప్పుడు లక్కీ మిత్రకు కాల్ చేస్తుంది. లక్కీ మిత్రతో కాంపిటేషన్ అంతా ఫేక్ నాన్న ఎవరో మమల్ని కిడ్నాప్ చేశారు అని చెప్తుంది. ఎక్కడున్నారని అని మిత్ర అడుగుతాడు. లక్కీ కిడ్నాపర్లు ఇద్దరు ఉన్నారని వాళ్ల ఫోన్ కొట్టేసి ఫోన్ చేస్తున్నామని అంటుంది.  మిత్ర లక్కీతో వెంటనే ఆ ఫోన్ నుంచి నాకు లొకేషన్ పంపు నేను వచ్చే వరకు వాళ్లకు అనుమానం రాకుండా మ్యానేజ్ చేయండి అని చెప్తాడు. ఇక మిత్ర పరుగులు తీస్తాడు. అరవింద మిత్రని ఆపితే పిల్లలు కిడ్నాప్ అయ్యారమని చెప్తాడు. అరవింద మిత్రను ఆపుతుంది మేం చూసుకుంటాం అని చెప్తుంది. మిత్ర ఒప్పుకోకపోవడంతో నీకు ఈ రోజు ప్రాణగండం ఉందిరా నువ్వు బయటకు వెళ్లొద్దు అని చెప్తుంది. మనీషా కూడా ఆపడానికి ప్రయత్నిస్తే లేని కడుపు ఉందని చెప్పిన నీకు పిల్లల విలువ ఏం తెలుస్తుంది. నా లక్ష్మీ పిల్లల గురించి అడిగితే నేను సమాధానం చెప్పలేను అని మిత్ర అంటాడు. అరవింద ఆపడానికి ప్రయత్నిస్తే దానికి మిత్ర వినకుండా నీకు నీ కొడుకు ప్రాణాలు ఎంత ముఖ్యమో నాకు నా పిల్లల ప్రాణాలు అంతే ముఖ్యం అని చెప్పి వెళ్లిపోతాడు. 

లక్ష్మీ దగ్గరకు వివేక్, జాను వెళ్తారు. లక్ష్మీ పిల్లలు ఏమైపోయారో అని ఏడుస్తుంది. ఇంతలో జున్ను లక్ష్మీకి కాల్ చేస్తాడు. నాన్న వస్తున్నారు నువ్వు రా అమ్మ అని లొకేషన్ షేర్ చేస్తాడు. లక్ష్మీ, వివేక్, జానులు లొకేషన్‌కి పరుగులు తీస్తారు. రౌడీలు డోర్ కొడితే పిల్లలు తీయరు మేం లోపలే ఉంటామని అంటారు. మరోవైపు ఇంట్లో ఉన్న పాము బయటకు వచ్చేస్తుంది. మనీషా బయట ఉన్న దేవయాని దగ్గరకు వెళ్తుంది. సరయు దొరికిపోయిందేమో అని టెన్షన్ పడతారు. మనీషా సరయుకి కాల్ చేయడానికి సిద్ధ పడుతుంది. ఇక పాము దేవయాని కాలు దగ్గర నిల్చొంటుంది. మనీషా చూసి షాక్ అయిపోతుంది. పాము దేవయానిని కాటేస్తుంది. దేవయాని పాము కాటేసిందని ఏడుస్తుంది. అరవింద, జయదేవ్ బయటకు వస్తారు. దేవయానిని తీసుకొని మనీషా హాస్పిటల్‌కి వస్తుంది. సిటీ మధ్యలో ఉన్న ఇంటిలోకి పాము ఎలా వస్తుంది  ఆ పాము మిత్ర కోసం వచ్చిందేమో అని అనుకొని కంగారు పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: రత్నమాలకు పక్షవాతం.. గిరి మారిపోయాడా.. త్రిపుర పెళ్లికి ఒప్పుకుంటుందా!