జ్యోతి రాయ్ లేదా జ్యోతి పూర్వాజ్ అని అసలు పేరు చెబితే గుర్తు పట్టే ప్రేక్షకులు ఎంత మంది ఉన్నారో కానీ... 'గుప్పెడంత మనసు' సీరియల్ జగతి మేడమ్ అంటే చాలా మంది తెలుగు ప్రజలు గుర్తు పడతారు. ఆ సీరియల్, అందులో జ్యోతి పూర్వాజ్ క్యారెక్టర్ అంత పాపులర్. ఇప్పుడు ఆవిడ సినిమా చేస్తున్నారు. ఆ మూవీ టైటిల్ 'కిల్లర్'. ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
'కిల్లర్' గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!'శుక్ర', 'మాటరాని మౌనమిది', 'ఏ మాస్టర్ పీస్' సినిమాలతో ప్రేక్షకులకు డిఫరెంట్ కంటెంట్ అందించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు పూర్వాజ్ (Suku Purvaj). ఒక సెక్షన్ ఆఫ్ మూవీ లవర్స్‌లో ఆయనకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న మరొక సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ 'కిల్లర్' (Killer Movie 2025). దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటిస్తున్నారు. ఇందులో జ్యోతి పూర్వజ్ హీరోయిన్.
'కిల్లర్' పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ చిత్రీకరణ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయని, ఈ నెల 30వ తేదీన సినిమా గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. థింక్ సినిమా బ్యానర్ మీద ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read: ఎవరీ ప్రియాంక? రెండో పెళ్లి చేసుకుంటే ఎందుకంత డిస్కషన్... వశీతో బిగ్ బాస్ బ్యూటీ ప్రేమకథ తెల్సా?
'కిల్లర్' పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''ఇదొక సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్. లవ్, రొమాన్స్, రివేంజ్, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), థ్రిల్లర్ అంశాలను మేళవించి రూపొందించాం. ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. త్వరలోనే భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు. పూర్వాజ్, జ్యోతి పూర్వజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో విశాల్ రాజ్, చందూ, గౌతమ్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: అషీర్ ల్యూక్ - సుమన్ జీవరత్నం, వీఎఫ్ఎక్స్ - వర్చువల్ ప్రొడక్షన్: మెర్జ్ ఎక్స్ ఆర్.
Also Read: ఓదెల 2 రివ్యూ: తమన్నాతో 'అరుంధతి' తీయాలని ట్రై చేస్తే ఏమైంది? సినిమా హిట్టా? ఫట్టా?