Samantha Produced Subham Movie Release Date: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి.. ఫస్ట్ మూవీ 'శుభం' నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె వెల్లడించారు.
థియేటర్లలో రిలీజ్ ఎప్పుడంటే?
'శుభం' (Subham) సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు సమంత అధికారికంగా వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'మే నెల ఇప్పుడే 'శుభం' సినిమాతో ఫుల్ ఖుషీ అయిపోయింది. మే 9న థియేటర్ల వద్ద కలుద్దాం.' అంటూ ట్వీట్ చేశారు. నిజానికి సమంత చాలా రోజుల వరకూ ట్విట్టర్‌కు దూరంగా ఉన్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె చాలా గ్యాప్ తర్వాత తాను నిర్మించిన 'శుభం' సినిమానే ఫస్ట్ ట్వీట్‌లో ప్రమోట్ చేశారు. ఇప్పుడు తాజాగా.. రిలీజ్ డేట్ ప్రకటించారు. నటిగా సక్సెస్ అయిన ఆమె నిర్మాతగానూ సక్సెస్ కావాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: 'వాళ్లు నమ్మక ద్రోహం చేశారు' - 'దసరా' విలన్‌పై ఫిర్యాదు వెనక్కు తీసుకున్న నటి విన్సీ అలోషియస్
'శుభం' సినిమాకు 'సినిమా బండి' ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా.. హర్షిత్ రెడ్డి, సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన టీజర్ భారీ హైప్ క్రియేట్ చేసింది. హారర్, కామెడీ జోనర్‌లో భార్యాభర్తల మధ్య జరిగే సంఘటనలే ప్రధానాంశంగా ఈ స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. భార్యలు సీరియళ్లు, టీవీ పిచ్చి కారణంగా భర్తలు పడే ఇబ్బందులను కామెడీ అంశంగా చూపిస్తూనే.. హారర్ అంశాలను జోడించినట్లు తెలుస్తోంది.
'శుభం' సినిమాకు వసంత్ మరిగంటి స్టోరీ అందించారు. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'పరదా' మూవీని సైతం ప్రవీణ్ కండ్రేగులే డైరెక్ట్ చేశారు. మృదుల్ సుజిత్ సేన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించగా.. రామ్ చరణ్ తేజ్ ప్రొడక్షన్ డిజైన్ పనులు చూసుకున్నారు. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా ఉన్నారు.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో 'రక్త్ బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్', 'మా ఇంటి బంగారం' వంటి సినిమాలు ఉన్నాయి. మరోవైపు, సమంత, బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన 'సిటాడెల్: హనీ బన్నీ' (Citadel Honey Bunny) వెబ్ సిరీస్ సీజన్ 2ను 'అమెజాన్ ప్రైమ్ వీడియో' క్యాన్సిల్ చేసింది.
ఇండియన్, ఇటాలియన్ వెర్షన్లను కొనసాగింపులు క్యాన్సిల్ చేస్తూ.. దీనికి బదులుగా వీటిని మాతృకలో విలీనం చేయనున్నట్లు అమెజాన్ ప్రతినిథులు స్పష్టం చేశారు. నిజానికి సమంత 25 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎక్కువ కష్టపడింది 'సిటడెల్' కోసమే. ఓ వైపు మయోసైటిస్‌తో బాధ పడుతూనే సిరీస్‌లో కష్టమైన యాక్షన్ సీన్స్ పూర్తి చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ వెబ్ సిరీస్ 'సిటాడెల్'కు ఇండియన్ వెర్షన్‌గా ఈ సిరీస్ రూపొందింది.