Lakshmi Nivasam Serial April 18th Today Episode: జానుతో పెళ్లికి లైన్ క్లియర్ చేసుకుంటుంటాడు జై నందన్. మరోవైపు, విశ్వ జానుతో తన ప్రేమ విషయం చెప్పలేకపోయినందుకు వేదనకు గురవుతుంటాడు. ఇదే సమయంలో తనకు ఓ అత్తయ్య ఉందని ఆమె ప్రేమ పెళ్లి చేసుకుని తన కుటుంబానికి దూరమైందని తల్లి త్రివేణి ద్వారా తెలుసుకుంటాడు. అటు, తులసి దృష్టిలో రౌడీ షీటర్‌గా మిగిలిపోయిన సిద్ధు ఆమెను ఇంప్రెస్ చేసే పనిలో పడతాడు. దీంతో అతనికి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..

కీర్తికి లక్ష్మి క్లాస్

తమ చీరలిచ్చి గిన్నెలు తీసుకోవాలని అనుకుంటారు లక్ష్మి కోడళ్లు. అతని వద్ద కీర్తి తన గొప్పతనం చూపించుకోవాలని ఆరాటపడుతుంది. ఆ గిన్నెలు తమకు వద్దంటూ.. లక్ష్మి తన చీరలిచ్చి గిన్నెలు తీసుకుంటుంది. ప్రతి ఒక్కరి వద్ద కూడా నీ డాబు చూపించుకోవాల్సిన అవసరం లేదంటూ కీర్తికి క్లాస్ తీసుకుంటుంది లక్ష్మి. ఇదే సమయంలో లక్ష్మి పుట్టింటి గురించి వెటకారంగా మాట్లాడుతుంది కీర్తి.

ఇంతలో శ్రీనివాస్ కలగజేసుకుని ఆమె నోటికి తాళం వేస్తాడు. అయితే, తన పుట్టింటి గురించి ఎవరికీ ఏమీ చెప్పొద్దంటూ లక్ష్మి శ్రీనివాస్‌కు చెప్తుంది. తులసి, జాను పెళ్లిళ్లు అయిపోతే ఇంటి గురించి ఆలోచిద్దామని.. తన గతం, పుట్టింటి గురించి కోడళ్ల వద్ద ఏమీ చెప్పొద్దంటూ లక్ష్మి.. శ్రీనివాస్‌తో అంటుంది.

సిద్ధుతో తులసి పెళ్లి!

సిద్ధు పెళ్లి గురించి అతని తల్లి విశాలాక్షి బసవ వద్ద ప్రస్తావిస్తుంది. సరిగ్గా అదే టైంకు అక్కడికి వచ్చిన పెద్ద కోడలు నీలిమ వెటకారంగా మాట్లాడుతుంది. మనకు డబ్బు వద్దని అణకువ ఉన్న పిల్ల కావాలని విశాలాక్షి బసవతో అంటుంది. మన కీర్తి ఆడపడుచు తులసితో సిద్ధుకు పెళ్లి చేద్దామని అంటుంది. దీంతో బసవ, అతని తల్లి తులసికి కుజ దోషం ఉందని ఆమెకి పెళ్లి కాదని పెటాకులే అవుతుందని.. ఆమెపై కోప్పడతారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన సిద్ధుకు విషయం చెప్తాడు బసవ. ఇది విన్న సిద్ధు తన తల్లిపై కోపం తెచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 

జై యాటిట్యూడ్ డిఫరెంట్

జానుతో పెళ్లి ఫిక్స్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న సిద్ధు అదే మూడ్‌లో ఆఫీసుకు వస్తాడు. ఇంతలో అతని ఆఫీసులో పని చేసే వ్యక్తి తన పెళ్లి అంటూ కార్డ్ ఇస్తాడు. దీంతో అతనికి రూ.12 లక్షలు చెక్ ఇస్తాడు. కార్డులో పెళ్లి కూతురు పేరు జాను అని చూసి.. పెళ్లి క్యాన్సిల్ చేసుకోమంటాడు. లేదంటే పెళ్లి కూతురునైనా మార్చేయాలంటూ తన ఉద్యోగితో చెప్తాడు జై. తను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి పేరు కూడా జాను అని.. ఆ పేరు తాను మాత్రమే పలకాలంటూ అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు జై.

తులసికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్

మరోవైపు, సిద్ధుకు మేయర్ పదవి రాకుంటే తన కొడుకు సిద్ధు రాజకీయ భవిష్యత్తు ఏంటో అంటూ తన తల్లితో అంటాడు బసవ. ఎలాగైనా మునుస్వామి ఓడించాలని తల్లి సలహా ఇస్తుంది. పాలిటిక్స్ వాడుకోవాలని.. మునుస్వామి కూతురును సిద్ధుకి ఇచ్చి పెళ్లి చేయాలంటూ సలహా ఇస్తుంది అతని తల్లి. దీంతో వెంటనే తన ప్రత్యర్థి మునుస్వామికి కాల్ చేస్తాడు బసవ. నీతో వియ్యం అందుకోవాలనుకుంటున్నట్లు అతనితో చెప్తాడు బసవ. ఇది విని ఆశ్చర్యపోయిన మునుస్వామి.. తాను కూడా ఇదే అడుగుదామనుకున్నామని.. కానీ అహం అడ్డు వచ్చి ఆగిపోయామంటూ చెప్తాడు. తన కూతురు కనిష్క సిద్ధుని ఇష్టపడిందని అంటాడు.

మరి సిద్ధు ఈ పెళ్లికి ఒప్పుకొంటాడా?, జానును దూరం చేసుకున్న విశ్వ పరిస్థితి ఏంటి?, జై ఇదే ఆటిట్యూడ్‌తో జానును పెళ్లి చేసుకుంటాడా? ఇది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.