Ennallo Vechina Hrudayam Serial Today Episode బాల త్రిపుర కోసం డబ్బులు, నగలు తీసుకొని రామగిరి బయల్దేరుతాడు. త్రిపుర, గిరిల పెళ్లి జరుగుతుంటుంది. మరోవైపు గాయత్రీ అత్తింటి వారిని పుట్టింటికి తీసుకెళ్తుంది. త్రిపుర వాళ్లు రామగిరి వెళ్లారని నాటకాల వాళ్లు చెప్తారు. గాయత్రీ తాతయ్యకి కాల్ చేస్తుంది. తాతయ్య కాల్ లిఫ్ట్ చేయరు. ఇక నాటకాల వాళ్లు బాల డబ్బు, నగలు తీసుకొచ్చాడని అవి తీసుకొని రామగిరి వెళ్లారని చెప్పడంతో అందరూ రామగిరి బయల్దేరుతారు.
గిరి త్రిపురకు తాళి కట్టడానికి రెడీ అవుతాడు. తాళి కట్టే టైంకి బాల ఎంట్రీ ఇస్తాడు. సుందరి అని పిలవడంతో తాళి కడుతున్న గిరి ఆగిపోతాడు. బాల తీసుకొచ్చిన బ్యాగ్ రత్నమాల వీల్ ఛైర్‌కి తగిలి రత్నమాల వీల్ చైర్ ముందుకు వెళ్తుంది. అది ఓ పెద్ద గునపం వైపు దూసుకుపోతే గిరి పరుగులు తీస్తాడు. మరో వైపు లాయర్ ఫోన్ చేస్తే పెద్దాయన త్రిపురకు ఫోన్ ఇవ్వమని అంటాడు. గిరి వాళ్లు ఇచ్చిన నోట్లు మొత్తం కాగితాలే ఉంటాయి. అది చూసి లాయర్ త్రిపురతో పైన ఒరిజినల్ నోట్లు ఉన్నాయి లోపల తెల్ల కాగితాలు ఉన్నాయి నువ్వు ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నావో వాళ్లు నిన్ను మోసం చేశారు అంటారు. త్రిపుర షాక్ అయిపోతుంది.
గునపం తగులుతుందని రత్నమాల లేచి నిలబడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఎంత మోసం చేశావ్ అని రత్నమాల తాత తిట్టి త్రిపురని తీసుకెళ్లబోతారు. బాల అడ్డుకుంటే బాలని గిరి కొడతాడు. త్రిపుర మెడలో బలవంతంగా తాళి కట్టబోతాడు. బాల మళ్లీ రావడంతో గిరి బాలని చాలా గట్టిగా కొట్టేస్తాడు. బాలని కొట్టడంతో బాల కళ్లు తిరిగి పడిపోతాడు. ఇంతలో గాయత్రీ, అనంత్, యశోద, బామ్మ అక్కడికి వస్తారు. బాలని చూసి పరుగులు తీస్తారు. రత్నమాల వాళ్లు పారిపోతారు. బామ్మ వాళ్లు బాలని పట్టుకొని ఏడుస్తారు. తాతగారు గాయత్రీకి విషయం చెప్పబోతే త్రిపుర ఆపేస్తుంది.
త్రిపుర బాల దగ్గరకు వెళ్లబోతే యశోద ఆపేస్తుంది. గాయత్రీతో మా అక్క ఏ తప్పు చేయదు అన్నావ్ కదా ఒక సారి అటు చూడు అని డబ్బుల బ్యాగ్ చూపిస్తుంది. ఆ డబ్బు బాల ఎందుకు ఇంటి నుంచి తీసుకొచ్చి తనకు ఎందుకు ఇస్తున్నాడు ఇప్పుడేమంటావ్ అని అంటుంది. డబ్బు కోసమే తను కేర్ టేకర్‌గా చేరిందని యశోద త్రిపుర మీద నిందలు వేస్తుంది. మా అక్క అలాంటిది కాదు అని గాయత్రీ అంటుంది. త్రిపుర మాట్లాడబోతే యశోద మాట్లాడనివ్వదు. నువ్వో మోసగత్తెవు అని అర్థమైందని తిడుతుంది. ఇక అందరూ బాలని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. గాయత్రీని అనంత్ మాతో వస్తావా మీ అక్కతో ఉంటావా అని అడగటంతో గాయత్రీ అక్క వైపు చూస్తుంది. త్రిపుర వెళ్లిపో అని సైగ చేయడంతో గాయత్రీ వెళ్లిపోతుంది.
బాలకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరూ ఏడుస్తారు. బాల తండ్రి, పిన్నిబాబాయ్‌లు వస్తారు. త్రిపుర వల్లే ఇదంతా అని యశోద చెప్తుంది. త్రిపుర మాయమాటలు నమ్మి డబ్బు నగలు తీసుకొని వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని బామ్మ అంటుంది. త్రిపుర అలాంటిదికాదని గాయత్రీ చెప్తుంది. అందరూ త్రిపురని తిడతారు. గాయత్రీని అనంత్ పెళ్లి చేసుకున్నందుకు వాసుకి వాళ్లు గాయత్రీని తిడతారు. నగలు, డబ్బు పోవడంతో గాయత్రీకి కూడా వాటా ఉంటుందని అంటారు. డాక్టర్ వచ్చి బాల తలకు బలమైన గాయం అయిందని బాల కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్తారు. అందరూ ఏడుస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: రత్నమాలకు పక్షవాతం.. గిరి మారిపోయాడా.. త్రిపుర పెళ్లికి ఒప్పుకుంటుందా!