Chhatrapati Sambhaji Maharaj: చావు సిగ్గుతో తలదించుకున్న వేళ! శంభాజీ మహారాజును ఔరంగజేబు ఎంత దారుణంగా చంపించాడంటే..
Sambhaji Maharaj | చావు సిగ్గుతో తలదించుకున్న వేళ.. శంభాజీ మహారాజును ఔరంగజేబు ఎంత దారుణం గా చంపించాడు అంటే...!

Maratha king Sambhaji Maharaj | చత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా "చావా " సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శంభాజీ గా నటించిన 'విక్కీ కౌశల్ ' నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ లో చూపించిన హింస పై ఒక సెక్షన్ షాక్కు గురైంది. శభాజీ మహారాజ్ ను ఇన్ని హింసలు పెట్టి హత మార్చారా అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కానీ చారిత్రకంగా చూస్తే శంభాజీ మహారాజును ఔరంగజేబ్ సినిమాలో చూపించిన దాని కన్నా చాలా హింసాత్మకం గా 15 రోజులు పాటు చిత్రహింసలు పెట్టి హత మార్చాడు. రాజరికం లో రక్తపాతం సహజమే అయినా శంబాజీ హత్య మాత్రం నీచాతి నీచమైంది. చాలామంది చరిత్రకారులు " మృత్యువు సైతం సిగ్గుతో తలదించుకునే దారుణ హింసాత్మాక హత్య "గా దీన్ని వర్ణిస్తారు.
చత్రపతి శివాజీ మరణంతో రాజైన శంభాజీ
ఔరంగాజేబుకు కంటిపై నిద్ర లేకుండా చేసిన ఛత్రపతి శివాజీ అకస్మాత్తుగా 1680లో మృతి చెందారు. ఆ తర్వాత రెండవ చత్రపతిగా పగ్గాలు చేపట్టిన ఆయన పెద్ద కుమారుడు శంభాజీ 9 ఏళ్ల పాటు 1689 వరకూ రాజ్యాన్ని కాపాడుతూ వచ్చాడు. జీవితాంతం పోరాటాలతోనే గడిపిన శంభాజీ ని నమ్మినవాళ్లే ద్రోహం చేసి మొగల్ సైన్యానికి పట్టించారు అంటారు. ద్రోహం వెనకాల కారణాల పట్ల రకరకాల వాదనలు ఉన్నాయి కానీ ద్రోహం జరిగిందనే మాటయితే వాస్తవం అని చరిత్ర కారుల కథనం. సంగమేశ్వర్ లో కొద్దిపాటి అంగరక్షకులతో రహస్యంగా ఉన్న శంభాజీ గురించిన వివరాలు ద్రోహులు మొగల్ సైన్యానికి అందజేశారు. ముఖర్రబ్ ఖాన్ నాయకత్వం లోని మొఘల్ సైన్యం శంభాజీని అయన మిత్రుడు పట్టుకుని 'కవి కలశ్ ' ను బంధించి సోలాపూర్ దగ్గర లోని 'అకలూజ్ ' లో ఉన్న ఔరంగజేబు వద్దకు పంపించాడు. ఈ వార్త విన్న మొఘల్ చక్రవర్తి ఆ ప్రాంతానికి ఆనందం తో 'అసద్ నగర్ 'అని పేరు పెట్టాడు.
నగరంలో శంభాజీని బఫూన్ దుస్తుల్లో ఊరేగించిన ఔరంగ్ జేబు
శంభాజీ కంటే ముందు మొఘల్ సైన్యం పట్టుకున్న బీజాపూర్, గోల్కొండ సుల్తాన్ లకు ఇచ్చిన మర్యాద కూడా శంబాజీ మహారాజ్ కి ఇవ్వలేదు ఔరంగజేబు కనీసం వాళ్లిద్దరినీ దౌలతా బాద్ కోటలో ఖైదు చేసాడు. కానీ శంబాజీ మహారాజ్ పట్ల తీవ్రమైన క్రూరత్వాన్ని చూపించాడు. ముందుగా నగరంలో శంభాజీ మహారాజ్ ను, కవి కలశ్ ను బఫూన్ ల్లా డ్రెస్ వేసి.. అంగీల చివర చిన్న చిన్న గంటలు కట్టి ఒంటెల మీద ఎక్కించి ఊరేగించారు. ఆ తంతు జరుగుతున్న సమయంలో మొగల్ సైన్యం ఎగతాళి చేస్తూ కేకలు వేశారట. తర్వాత వారిని ఔరంగజేబు వద్దకు తీసుకుపోయారు.
శంభాజీ ముందు 3 షరతులు పెట్టిన ఔరంగజేబు
తన ముందు ఖైదీగా ఉన్న శంభాజీ ముందు ఔరంగజేబు మూడు షరతులు పెట్టాడు.
1) మరాఠాల అధీనంలో ఉన్న అన్ని కోటలు మొఘలులకు అప్పజెప్పాలి
2) మరాఠా రాజ్యపు రహస్య నిధులను ఔరంగజేబుకు ఇచ్చేయాలి
3) మొఘల్ కోర్టు లో ఉన్న మరాఠా గూఢచారులు, శంభాజీకి సహకరించే అధికారుల పేర్లు బయట పెట్టాలి.
వీటితోపాటు శంబాజీ ముస్లిం గా మారాలి. అప్పుడు శంభాజీ ని ప్రాణాలతో వదిలేస్తానని ఔరంగజేబు అన్నాడు. ఆ తర్వాత జరిగిందానిపై మాత్రం మొఘల్, మరాఠా రికార్డ్స్ డిఫరెంట్ గా చెబుతున్నాయి. మొఘల్ రికార్డ్స్ ప్రకారం శంభాజీ తీవ్ర స్థాయి లో ఔరంగజేబు ను, ప్రవక్త ను దూషించడంతో ఆయనకు మరణ శిక్ష విధించారు. ఇక మరాఠా రికార్డ్స్ ప్రకారం తనను ముస్లిం గా మారమన్న ఔరంగజేబు తో " తనకు లంచం గా ఔరంగజేబు తన కూతురిని ఇచ్చినా సరే మతం మారనని" శంభాజీ అనడం తో మరణ శిక్ష విధించారు మొఘల్ ఆస్థానం లోని ఉలేమా లు
15 రోజుల టార్చర్... ఊహించలేనంత హింస
మొఘల్ కాలం నాటి చరిత్రకారుడు ఖాఫీ ఖాన్ (1664-1732), బ్రిటీష్ హిస్టారియన్ డెన్నిస్ కిన్కైడ్ (1905-1937) ప్రకారం
శిక్ష విధింపబడిన అదే రోజు రాత్రి శంభాజీ, కవి కలశ్ ల కళ్ళను ఎర్రటి ఇనుప చువ్వలతో పొడిచేసారు. వారి నాలుకలు కట్ చేసారు. ఇలా 15 రోజుల పాటు చిత్ర హింసలు పెట్టారు. వారి చర్మాన్ని సైతం వలిచేసి చివరికి కొన ప్రాణాలతో ఉన్న వారిని 11 మార్చ్ 1689 న తులాపూర్ లో భీమా నది ఒడ్డున శిరచ్చేదం చేసారు. ఆ తరువాత శంభాజీ శరీరాన్ని ముక్కలు చేసి నదిలో పడేసారు. వాటిలో దొరికిన వాటిని శంభాజీ అనుచరులు వెలికి తీసి సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు జరిపారు.
శంభాజీ అనుభవించిన ఈ దారుణ నరకానికి హింస కు భయపడకుండా ఆయన చూపిన ధైర్యానికి గుర్తుగా శంభాజీ ని ' ధరమ్ వీర్ ' మరాఠా ప్రజలు ఆరాధించడం మొదలుపెట్టారు. ఆయన బతికుండగా చేసిన దానికంటే మరణించాక ప్రజలకు ఐకాన్ గా మారారు . మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరాఠా ప్రజలు ఏకం కావడానికి శంభాజీ త్యాగం కారణమైందని హిస్థారియన్స్ చెబుతారు. శతాబ్దాలు గడిచినా ఔరంగజేబులోని క్రూరత్వానికి శంభాజీ హత్య చరిత్ర లో ఒక ఉదాహరణగా నిలిచిపోయింది.