మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటించిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' (RamaRao On Duty Movie). జూలై 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ రెండు పాటలు విడుదల చేశారు. ఈ రోజు మూడో పాట 'నా పేరు సీసా' విడుదల చేశారు.
 
సామ్ సిఎస్ సంగీతం అందించిన 'నా పేరు సీసా...' (Naa Peru Seesa Lyrical) ను చంద్రబోస్ రాశారు. శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాట స్పెషాలిటీ ఏంటంటే... ఇందులో అన్వేషి జైన్ (Anveshi Jain) స్టెప్పులు వేశారు. హిందీలో 'గండి బాత్ 2'తో ఆమె పాపులర్ అయ్యారు. ఈ సాంగ్ కంటే ముందు తెలుగులో 'క‌మిట్‌మెంట్‌' సినిమాలో నటించారు. అది ఇంకా విడుదల కాలేదు. ఈలోపు రవితేజ సినిమాలో సాంగ్ చేసే అవకాశం ఆమెకు వచ్చింది. 


Also Read : 'పీకే'లో రేడియోతో ఆమిర్ - 'లైగర్'లో రోజా పూల బొకేతో విజయ్ దేవరకొండ



శరత్ మండవ (Sarath Mandava) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఎస్ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ పతాకాలపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇసుక మాఫియాతో పాటు సమాజంలో అవినీతిపై పోరాటం చేసే ప్రభుత్వ అధికారిగా రవితేజ కనిపించనున్నారు. 


Also Read : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...