మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా నటించిన 'పక్కా కమర్షియల్' శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు సినిమా మంచి వసూళ్లు సాధించిందని, గోపీచంద్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిందని చిత్ర బృందం పేర్కొంది. 


Pakka Commercial First Day Collections: ప్రపంచవ్యాప్తంగా 'పక్కా కమర్షియల్' సినిమాకు మొదటి రోజు 6.3 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని 'పక్కా కమర్షియల్' చిత్ర నిర్మాణ సంస్థలు జీఏ 2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ తెలిపాయి. వెండితెరపై ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మిస్ కావొద్దని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.


Also Read : 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?






విలక్షణ కథలతో వినోదాత్మక చిత్రాలు తీస్తూ... ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న మారుతి దర్శకత్వం వహించిన చిత్రమిది. టైటిల్‌కు తగ్గట్టు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అంశాలతో సినిమా తీశారని, ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా రాశీ ఖన్నా (Raashi Khanna) క్యారెక్టరైజేషన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని అంటున్నారు.


Also Read : 'పీకే'లో రేడియోతో ఆమిర్ - 'లైగర్'లో రోజా పూల బొకేతో విజయ్ దేవరకొండ