'పీకే' కోసం ఆమిర్ ఖాన్ చేశారు. ఇప్పుడు 'లైగర్' కోసం విజయ్ దేవరకొండ సేమ్ టైప్ ఆఫ్ అట్టెంప్ట్ చేశారు. ఆమిర్ రేడియో అడ్డు పెట్టుకుంటే... విజయ్ దేవరకొండ రోజా పూల బొకే అడ్డు పెట్టుకున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...


విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా నటించిన సినిమా 'లైగర్' (Liger Telugu Movie). ఆగస్టు 25న విడుదల ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ''నటన పరంగా, మానసికంగా, శారీరకంగా... మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ ఇది. ఈ సినిమా నా నుంచి సర్వస్వం తీసుకుంది. నేనూ మీకు అంతా ఇచ్చేస్తా'' అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టిల్ చూస్తే... ఆయన న్యూడ్ గా కనిపించారు. అక్కడ రోజా పూల బొకే మాత్రమే అడ్డంగా పెట్టుకుని డేరింగ్ అట్టెంప్ట్ చేశారు. 


సంపూర్ణేష్ బాబు కూడా ఈ తరహా స్టంట్ ఒకేసారి చేశారు. 'క్యాలీఫ్లవర్' సినిమా కోసం ఆయన క్యాలీఫ్లవర్ అడ్డు పెట్టుకుని స్టిల్స్ వదిలారు. ఇప్పుడు ఈ స్టిల్స్ అన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. 


Also Read : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...
 





పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లైగర్' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ భామ అనన్యా పాండే కథానాయిక.  


Also Read : రామ్ 'వారియర్'కు సీక్వెల్ - కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్