''నేను 'ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి' పోస్టర్లు, పాటలు చూశా. కరీంనగర్ నేపథ్యంలో సినిమా చేయడం సంతోషకరం. ప్రచార చిత్రాలు ఆసక్తి కలిగించాయి. నేను ఈ చిత్రంలో  'తురుమై వచ్చేయ్' పాట విడుదల చేశా. వినగానే నచ్చేలా ఉంది. తెలంగాణ నేపథ్యంలో మరిన్ని సినిమాలు రావాలని ఆశిస్తున్నాను. 'ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి' సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. చైతన్య రావుతో పాటు ఈ చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్'' అని  అన్నారు.


30 Weds 21 Web Series Chaitanya Rao upcomong movie: '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పలు హిట్ సినిమాలు చేసిన యంగ్ హీరో చైతన్య రావు. ఆయన నటించిన కొత్త సినిమా 'షరతులు వర్తిస్తాయి'. ఇందులో భూమి శెట్టి హీరోయిన్. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్టార్ లైట్ స్టూడియోస్ పతాకంపై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. ఈ శుక్రవారం (మార్చి 15న) థియేటర్లలో విడుదల కానుంది. సినిమాలోని 'తురుమై వచ్చేయ్...' పాటను కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటకు పసునూరి రవీందర్ సాహిత్యం అందించగా... అరుణ్ చిలువేరు సంగీతంలో ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడారు.


Also Readఆస్కార్స్‌ చరిత్రలో 56 నామినేషన్లు, 21 అవార్డులు - ఇదీ క్రిస్టోఫర్ నోలన్ ఘనత, 'ఓపెన్ హైమర్' ఒక్కటే కాదు!



హీరో తెగువ చూపించే సందర్భంలో!
'షరతులు వర్తిస్తాయి' సినిమాలో 'తురుమై వచ్చేయ్...' పాటకు చాలా ప్రాముఖ్యం ఉందని హీరో చైతన్య రావు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''సమస్యను ఎదిరించే క్రమంలో హీరో ఎలాంటి తెగువ చూపించాడనేది ప్రేక్షకులకు ఈ పాటలో స్ఫూర్తి కలిగించేలా తెరకెక్కించారు. కేటీఆర్ గారు సాంగ్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది'' అని అన్నారు. సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు కుమార స్వామి చెప్పారు. ఎంతో బిజీగా ఉన్నా టైమ్ ఇచ్చి, 'తురుమై వచ్చేయ్' సాంగ్ రిలీజ్ చేసిన కేటీఆర్ (KTR)కు ఆయన థాంక్స్ చెప్పారు.


Also Readమాపై యుద్ధం ఆపండి... బదులుగా ఆస్కార్ అవార్డు ఇస్తా - రష్యాకు ఉక్రెయిన్ దర్శకుడు మిస్టిస్లావ్ చెర్నోవ్ ఆఫర్


చైతన్య రావ్, భూమి శెట్టి జంటగా నటించిన 'షరతులు వస్తాయి' సినిమాలో నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతామాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: రాజేశ్ స్వర్ణ - సంపత్ భీమారి - అశ్వత్థామ, కళా దర్శకత్వం: గాంధీ నడికుడికర్, కూర్పు: సీహెచ్ వంశీకృష్ణ - గజ్జల రక్షిత్ కుమార్, ఛాయాగ్రహణం: ప్రవీణ్ వనమాలి - శేఖర్ పోచంపల్లి, నేపథ్య సంగీతం: ప్రిన్స్ హెన్రీ, స్వరాలు: అరుణ్ చిలువేరు - సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల), మాటలు: పెద్దింటి అశోక్ కుమార్, నిర్మాణ సంస్థలు: స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైలి, నిర్మాతలు: శ్రీలత - నాగార్జున సామల - శారద - శ్రీష్ కుమార్ గుండా - విజయ - డా. కృష్ణకాంత్ చిత్తజల్లు, రచన & దర్శకత్వం: కుమారస్వామి (అక్షర).