స్టార్ హీరో 'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఫ్యామిలీ స్టార్' (Famil Star Movie). ఇందులో 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. తనకు తొలి వంద కోట్ల సినిమా, 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రెండోసారి విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో రెండో పాట 'కళ్యాణి వచ్చా వచ్చా'ను ఈ రోజు విడుదల చేయనున్నారు.


ఏవండీ... 'కల్యాణి వచ్చా వచ్చా'!
విజయ్ దేవరకొండ, పరశురామ్ కలయికలోని 'గీత గోవిందం'కు సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన గోపీసుందర్ ఈ సినిమాకు సైతం సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో రూపొందుతున్న 54వ చిత్రమిది. హీరో విజయ్ దేవరకొండకు 13వ సినిమా. 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ 'నందనాన...' సాంగ్ విడుదల చేయగా... సూపర్ హిట్ అయ్యింది. 


Family Star 2nd single Kalyani Vaccha Vaccha song releasing today: ఫిబ్రవరి 12న... అంటే ఇవాళ 'ఫ్యామిలీ స్టార్'లో రెండో సాంగ్ 'కళ్యాణి వచ్చా  వచ్చా'ను విడుదల చేయనున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకోవడంతో సినిమా టీం హ్యాపీగా ఉంది.


Also Readఆస్కార్స్‌ చరిత్రలో 56 నామినేషన్లు, 21 అవార్డులు - ఇదీ క్రిస్టోఫర్ నోలన్ ఘనత, 'ఓపెన్ హైమర్' ఒక్కటే కాదు!






ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్' థియేటర్లలో విడుదల కానుంది. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... నాలుగైదు సినిమాలు ఉండటంతో వాయిదా వేశారు. దానివల్ల మంచి జరిగింది. ఎన్టీఆర్ 'దేవర' వాయిదా పడటంతో ఏప్రిల్ 5న వస్తోంది. 'ఫ్యామిలీ స్టార్'లో 'మజిలీ', 'రామారావు ఆన్ డ్యూటీ', 'మైఖేల్' సినిమాల ఫేమ్ దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నారు.


Also Readమాపై యుద్ధం ఆపండి... బదులుగా ఆస్కార్ అవార్డు ఇస్తా - రష్యాకు ఉక్రెయిన్ దర్శకుడు మిస్టిస్లావ్ చెర్నోవ్ ఆఫర్


ఏప్రిల్ 5 శుక్రవారం. విడుదల రోజు ఓపెనింగ్స్ కలెక్షన్స్ బావుంటాయి. శని, ఆది వారాలైన 6, 7 తేదీల్లో వీకెండ్ వసూళ్లు సైతం బాగా వస్తాయి. అయితే... ఏప్రిల్ 8న ఉగాది వచ్చింది. తెలుగు పండుగ. పైగా, ఫ్యామిలీ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా. మంచి బజ్ రావడమే కాదు... థియేటర్లకు జనాలు కూడా వస్తారు. సో... సంక్రాంతి మిస్ అయినా విజయ్ దేవరకొండకు అంత కంటే మంచి రిలీజ్ డేట్ దొరికిందని చెప్పవచ్చు. దర్శక నిర్మాతలు అనౌన్స్ చేయలేదు గానీ ఈ విడుదల తేదీని సంగీత దర్శకుడు గోపీసుందర్ కన్ఫర్మ్ చేశారు.