Jyothika, Suriya Combined Net Worth: సూర్య‌, జ్యోతిక సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ క‌పుల్. ఇద్ద‌రు క‌లిసి ఎన్నో మంచి మంచి సినిమాలు తీశారు. ఇక పెళ్లైన త‌ర్వాత జ్యోతిక కొన్నేళ్లు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అయితే, ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ జంట‌.. ముంబైకి మకాం మార్చింది. పిల్ల‌ల్ని అక్క‌డి స్కూల్‌లో జాయిన్ చేసింది. అయితే ముంబైలో దాదాపు రూ.70 కోట్లు పెట్టి ఇల్లు కొనిందంట ఈ జంట‌. దీంతో ఇప్పుడు వీళ్ల ఆస్తుల వివ‌రాలు, వీళ్ల రెమ్యున‌రేష‌న్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజ‌న్లు. వాళ్ల ఆస్తుల విష‌యం, రెమ్యున‌రేష‌న్ ట్రెండింగ్ లోకి వ‌చ్చింది. 


బాలీవుడ్ లో బిజీగా సూర్య‌, జ్యోతిక‌


సినిమాల‌కి గ్యాప్ ఇచ్చి, మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన జ్యోతిక వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఇటీవ‌ల ఆమె న‌టించిన 'సైతాన్' సినిమా హిట్ టాక్ అందుకుంది. అజ‌య్ దేవ‌గ‌ణ్ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా ప‌ర్వాలేదు అనిపిస్తోంది. కాగా.. 1998లో 'డోలీ సజాకే రఖ్నా'తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జ్యోతిక దాదాపు 26 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 


ఆస్తుల విలువ ఎంతంటే? 


సూర్య‌, జ్యోతిక 2006లో వివాహం చేసుకున్నారు. కాగా.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వాళ్లు దాదాపు రూ.537 కోట్ల ఆస్తుల‌ను సంపాదించారు. దాంట్లో జ్యోతిక నికర ఆస్తుల విలువ దాదాపు రూ.331 కోట్లు. సూర్యతో ఆమె కలిగి ఉన్న మొత్తం ఆస్తుల్లో 61.63% ఆమె సొంతం అని తెలుస్తోంది. ఇక సూర్య ఆస్తి దాదాపు రూ.206 కోట్లుగా తెలుస్తోంది. 2014లో సూర్య నిక‌ర ఆస్తుల విలువ రూ.125 కోట్లు కాగా.. ఈ ప‌దేళ్ల‌లో ఆయ‌న ఆస్తులు దాదాపు 60 శాతం పెరిగాయి. ఇక సూర్య‌, జ్యోతిక‌కి ఇద్ద‌రికి ల‌గ్జరీ కార్లు కూడా ఉన్నాయ‌ట వాళ్ల‌కి బీఎండ‌బ్ల్యూ సిరీస్ 730ఎల్డీ కారు ఉంది. దాని విలువ దాదాపు రూ.1.38 కోట్లు. రూ.80 ల‌క్ష‌ల విలువ గ‌ల ఆడీ క్యూ7, రూ.60 ల‌క్ష‌ల విలువ గ‌ల మెర్సిడెస్ బెంజ్, దాదాపు కోటిన్న‌ర విలువ గ‌ల జాగ్వార్ కార్లు ఉన్నాయి. ఇక చెన్నైలో దాదాపు 20 వేల స్క్వేర్ ఫీట్స్ లో ఇల్లు కూడా ఉంది. 


ప‌దేళ్ల త‌ర్వాత రెమ్యున‌రేష‌న్ పెంపు..


ఇక సూర్య దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత త‌న రెమ్యున‌రేష‌న్ పెంచార‌ట‌. గ‌త ప‌దేళ్ల‌లో ఆయ‌న రూ.20 కోట్ల - రూ.25 కోట్ల మ‌ధ్య రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుండ‌గా.. ఇప్పుడు దాన్ని రూ.30 కోట్ల‌కు పెంచిన‌ట్లుగా బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ఆయ‌న కంగువాకి రెమ్యున‌రేష‌న్ పెంచార‌ని అంటున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. 'కంగువా', 'స‌ర్ఫువా' సినిమాల్లో సూర్య న‌టిస్తుండ‌గా, మ‌రికొన్ని హిందీ సినిమాల‌కి ఆయ‌న ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక జ్యోతిక 'డ‌బ్బా కార్టిల్' అనే సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ జంట ముంబైలో ఉంటున్నారు.


Also Read: కంగనా పాటకు సాయి పల్లవి డ్యాన్స్ - తన ఆనందానికి కారణం ఇదే!