Ramadan 2024: ఈ ఏడాది సౌదీ అరేబియాలో మార్చి 10వ తేదీన ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనం ఇచ్చింది. దీంతో 11వ తేదీ సోమవారం నుంచి అక్కడ చంద్రుడు దర్శనమివ్వనున్నాడు. భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో మరుసటిరోజున చంద్రుడు దర్శనమిస్తాడు. అందుకే సౌదీ తర్వాతి రోజు నుంచి మన దేశంలో ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. మన దేశంలో 12వ తేదీ నుంచి మంగళవారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి..

  
ఖురాన్ ఆవిర్భవించిన మాసం


ఈ నెలను అత్యంత పవిత్రంగా భావించడానికి ప్రధాన కారణం ఏంటంటే దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించింది. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన 'రోజా' ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు  కఠిన 'రోజా' ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది. 


Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!


మనసులో మలినాల ప్రక్షాళన


ఈ మాసంలో నెల రోజుల పాటూ ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ దీక్షలతో శరీరం, మనసులోని మలినాలు ప్రక్షాళన కావడంతో పాటు సర్వపాపాలు దహించుకుపోతాయని విశ్వసిస్తారు. సూర్యోదయ సమయంలో ‘సహర్‌’ నుంచి సూర్యాస్తమయం సమయంలో జరిపే 'ఇప్తార్‌' వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా  ఉపవాసం చేస్తారు. ఈ నెలలో ఎవరైనా చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని ముస్లింల ప్రగాఢ నమ్మకం.


చిన్నా పెద్దా అంతా ఉపవాస దీక్ష


వయసుతో పనిలేదు చిన్నా, పెద్దా, ముసలి అందరూ భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలను, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. ఖర్జూరపు పండు తిని దీక్ష విరమించిన తర్వాత పలురకాలైన వంటకాలు భుజిస్తారు.ఈ వంటకాల్లో ప్రత్యేకమైనది హలీమ్. 


'సుర్మా' సంప్రదాయం మాత్రమే కాదు


‘సుర్మా'తో కళ్లకు కొత్త అందం వస్తుంది. కళ్లకు ‘సుర్మా' పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్‌ గానే భావిస్తారు. ప్రవక్త హజరత్‌ మహ్మద్‌ సదా సుర్మా పెట్టుకునేవారని అంటారు.  పౌడర్‌ రూపంలో ఉండే సుర్మాను ముస్లింలు భరిణెల్లో దాచుకుని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్లకు పెట్టు కోవడానికి కూడా ఇవ్వడం సంప్రదాయం. నమాజు చేసేముందు ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు... ఇది కేవసం సంప్రదాయం మాత్రమే కాదు కళ్లకు ఆరోగ్యం


Also Read: ఈ వారం (మార్చి 10 - 16) ఈ రాశులవారిని గ్రహబలం కాదు మనోధైర్యమే నడిపిస్తుంది!


నమాజ్ ఎందుకు?


సాధారణంగా ప్రతి  శుక్రవారం ముస్లింలు నమాజ్‌ చేస్తుంటారు. ఇక రంజాన్‌ మాసంలో మత పెద్దలతో నమాజ్‌ చేయించడం ప్రశస్తమైనది. మసీద్ కు వెళ్ళలేనివారు తాము ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకుని ప్రార్థన చేస్తారు. నమాజ్ తర్వాత పిల్లలు, పెద్దలు అంతా ఒకరిపైమరొకరు స్నేహభావంతో  'అలయ్ బలయ్ ' అంటే ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగ రోజు షీర్‌ ఖుర్మా అనే మధురమైన వంటను అందరికీ రుచిచూపిస్తారు. దీంతో వీరి నెలరోజుల దీక్ష  పూర్తవుతుంది. 


ఖురాన్ సిద్ధాంతం


ఖురాన్ సిద్దాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారికోసం ఎంతోకొంత దానం చేయాలన్నది భావిస్తారు. పండ్లు, గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం  దానం చేయాలని ఖురాన్‌ చెబుతోంది. ఈ దానాల వల్ల నిరుపేదలు కూడా పండుగరోజు సంతోషంగా ఉండాలన్నదే ఆంతర్యం. లోకంలో ఎంతో మంది అభాగ్యులు, నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారో వారిపై మానవత్వం చూపాలన్నదే ఉపావసదీక్షల వెనుకున్న ఆంతర్యం.