దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న చిత్రం 'సీతా రామం'. యుద్ధంతో రాసిన ప్రేమకథ... అనేది ఉపశీర్షిక. ఇందులోని సెకండ్ సాంగ్ ప్రోమో ఈ రోజు విడుదల చేశారు. ఇది మృణాల్ ఠాకూర్ మీద తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది.

Continues below advertisement


'సీతా రామం' సెకండ్ సాంగ్ (Sita Ramam Second Lyrical) ప్రోమోకి వస్తే... మంచు కొండల మధ్యలో ముత్యంలా మెరుస్తున్న మృణాల్ ఠాకూర్‌ను చూపించారు. ఈ సినిమాలో ఆమె సీత పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ''మా సీత అంత అందంగా సినిమాలో రెండో పాట ఉంటుంది'' అని చిత్ర బృందం తెలిపింది.
 
'అందాల రాక్షసి', 'పడి పడి లేచె మనసు' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రమిది. రష్మికా మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  


Also Read : 'పీకే'లో రేడియోతో ఆమిర్ - 'లైగర్'లో రోజా పూల బొకేతో విజయ్ దేవరకొండ



'సీతా రామం' సినిమాను ఆగస్టు 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. 


Also Read : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...