అరుంధతి, భాగమతి, దేవసేన వంటి పేర్లు చెబితే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది ఒక్కరే! మిస్ అనుష్క శెట్టి (Anushka Shetty). యువ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)తో కలిసి ఆమె ఓ సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ విషయం ప్రేక్షకులకు తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... సినిమా టైటిల్ ఖరారు చేశారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి - టైటిల్ ఇదే!
Miss Shetty Mr Polishetty For Anushka 48th Movie : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి సినిమాకు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' టైటిల్ ఖరారు చేసినట్లు యూవీ క్రియేషన్స్ ఈ రోజు వెల్లడించింది. విశేషం ఏమిటంటే... హీరో హీరోయిన్లు ఇద్దరి పేర్లలో చివరి పేర్లు, ఇంటి పేర్లు అవే కావడం!
టైటిల్ రివీల్ చేసిన సందర్భంగా విడుదల చేసిన స్టిల్ గమనిస్తే... లండన్ సిటీలో అనుష్క శెట్టి, హైదరాబాద్ సిటీలో నవీన్ పోలిశెట్టి ఉన్నట్లు అర్థం అవుతోంది. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయనున్నట్లు యూవీ క్రియేషన్స్ సంస్థ పేర్కొంది.
అనుష్క... ఇంటర్నేషనల్ షెఫ్!
ఈ సినిమాలో అనుష్క షెఫ్ రోల్ చేస్తున్నారు. అదీ ఇంటర్నేషనల్ షెఫ్! ఆమె బర్త్ డే సందర్భంగా అన్విత రవళి శెట్టి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే, అనుష్క వంట చేస్తున్న స్టిల్ కూడా విడుదల చేశారు.
అనుష్కకు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. వాటి తర్వాత ఆ సంస్థలో అనుష్క నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. త్వరలో సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం... నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
'భాగమతి' తర్వాత అనుష్క...
'జాతి రత్నాలు' తర్వాత నవీన్!
సుమారు ఐదేళ్ళ తర్వాత అనుష్క శెట్టి నుంచి థియేటర్లలోకి వస్తున్న సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. 'భాగమతి' తర్వాత అనుష్క 'నిశ్శబ్దం' సినిమా చేశారు. అయితే, ఆ సినిమా ఓటీటీలో విడుదల అయ్యింది. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన హిస్టారికల్ సినిమా 'సైరా నరసింహా రెడ్డి'లో ఝాన్సీ లక్ష్మీ బాయి రోల్ చేశారు. అందువల్ల, ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
Also Read : రామ్ చరణ్ - 'బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా' అంటోన్న అమెరికన్ మీడియా
మరో విశేషం ఏమిటంటే... 'జాతి రత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కూడా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'యే. అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. హీరో హీరోయిన్లు ఇద్దరూ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత కొత్త సినిమాలకు సంతకం చేయాలని నవీన్ పోలిశెట్టి ఆలోచిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ గుసగుస. అందుకని, ఈ మధ్య కొత్త కథలు ఏవీ వినడం లేదని తెలుస్తోంది. ఆల్రెడీ సితార సంస్థలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అనుష్క కూడా కొత్త సినిమాలు ఏవీ అంగీకరించలేదు. ఆమె కూడా ఈ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విడుదలైన తర్వాత కొత్త సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
Also Read : సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మృతి - 'విరూపాక్ష' టీజర్ విడుదల వాయిదా