కన్నడ కథానాయకుడు ఉపేంద్ర (Upendra) తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులే. త్వరలో 'కబ్జా' (మార్చి 17న విడుదల)తో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన భార్య ప్రియాంక (Priyanka Upendra) సైతం కొంత మంది తెలుగు ప్రేక్షకులకు తెలుసు. జేడీ చక్రవర్తి 'సూరి', ఉపేంద్ర 'రా' సినిమాల్లో ఆమె నటించారు. ప్రియాంకా ఉపేంద్ర నటించిన తాజా సినిమా 'డిటెక్టివ్ తీక్షణ'.

  
ప్రియాంకా ఉపేంద్ర @ 50
కథానాయికగా, నటిగా ప్రియాంకా ఉపేంద్ర 50వ సినిమా (Priyanka Upendra 50th Film) 'డిటెక్టివ్ తీక్షణ'. దీనికి త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహించారు. ఈ రోజు సినిమాలో ప్రియాంక ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సూట్ వేసుకుని, గన్ పట్టుకుని స్టైలిష్ & ఇంటెన్స్ లుక్‌లో ఆమె కనిపించారు.


రషెస్ చూసి అప్రిషియేట్ చేసిన ఉపేంద్ర!
'డిటెక్టివ్ తీక్షణ' సినిమా రషెస్ ఉపేంద్ర చూశారని ప్రియాంక తెలిపారు. ఉపేంద్ర ఏమన్నారు? అనేదాని గురించి ప్రియాంక మాట్లాడుతూ ''మా ఆయన రషెస్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయారు. 'ఇది రా ఫుటేజ్ లా లేదు. పూర్తి డిఐ వర్క్ కంప్లీట్ చేశాక వచ్చే అవుట్ పుట్ ఎలా ఉంటుందో... అంత క్వాలిటీతో ఉంది' అన్నారు. ఆ విజువల్స్ ఉన్నాయని ఆయన ఆశ్చర్యపోయారు. ఈ సినిమాకు ఆయన మద్దతు ఎంతో ఉంది. 'డిటెక్టివ్ తీక్షణ' ఓపెనింగుకు కూడా ఆయన వచ్చారు. మా టీమ్ అందరికీ బెస్ట్ విషెష్ తెలిపారు'' అని చెప్పారు.
 
'బ్యోంకేష్ బక్షి', 'నాన్సీ డ్రూ' గుర్తొచ్చాయ్!  
సినిమా, దర్శకుడు గురించి ప్రియాంకా ఉపేంద్ర మాట్లాడుతూ ''రఘు చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ప్యాషనేట్. ఆయన 'డిటెక్టివ్ తీక్షణ' వన్ లైన్ చెప్పినప్పుడే నేను ఇంప్రెస్స్ అయిపోయా. ఇటువంటి ప్రధాన పాత్ర ఇంతకు ముందు ఎప్పుడూ ఒక మహిళ చేయలేదు. కథ వినగానే... నాకు 'బ్యోంకేష్ బక్షి', 'నాన్సీ డ్రూ' లాంటి సినిమాలు గుర్తు వచ్చాయి. ఇదొక స్ట్రాంగ్, ఇంటెలిజెంట్, బ్రేవ్ విమన్ కథ. రఘుకి విజువల్స్ పట్ల ప్రత్యేకమైన విజన్ ఉంది. ఆయన తాను అనుకున్న దాన్ని తెర మీదకి ఎంత సమర్థవంతంగా తీసుకు రాగలడో రెండు రోజుల షూటింగ్ చేయగానే నాకు అర్ధం అయిపోయింది'' అని చెప్పారు.
 
ఏడు భాషల్లో సినిమా విడుదల!
తెలుగు, కన్నడతో పాటు తమిళ, మలయాళ, ఒరియా, బెంగాలీ, హిందీ భాషల్లో 'డిటెక్టివ్ తీక్షణ' సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇదొక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని నిర్మాతలు గుత్తముని ప్రసన్న (పొలకల చిత్తూర్, ఆంధ్ర ప్రదేశ్), జి ముని వెంకట్ చరణ్ ( ఈవెంట్ లింక్స్, బెంగళూర్)  పురుషోత్తం బి (ఎస్ డి సి) తెలిపారు. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామన్నారు. 


Also Read : ఇదీ 'నాటు నాటు' మూమెంట్ అంటే - ఆస్కార్స్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లైవ్ డ్యాన్స్ 


ఫిమేల్ కాదు... కంటెంట్ ఓరియెంటెడ్!
'డిటెక్టివ్ తీక్షణ' సినిమాను ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాగా కాకుండా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా చూడాలని ప్రియాంకా ఉపేంద్ర చెబుతున్నారు. తనతో పాటు సినిమాలో చాలా ప్రధాన పాత్రలు ఉన్నాయని, ఇది కథ ప్రధానంగా సాగే సినిమా అని ఆవిడ పేర్కొన్నారు. ప్రేక్షకులకు సినిమా థ్రిల్ ఇస్తుందని చెప్పారు. సినిమాలో యాక్షన్ చేయడం ఎంజాయ్ చేశానన్నారు. 


Also Read సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మృతి - 'విరూపాక్ష' టీజర్ విడుదల వాయిదా