సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కథానాయకుడిగా సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మిస్తున్న సినిమా 'విరూపాక్ష'. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ టీజర్ చూశారు. చాలా బావుందని మేనల్లుడితో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ రోజు టీజర్ విడుదల చేయడం లేదు.


రావూరి పండు మృతికి సంతాపంగా...
మెగా అభిమాని, సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావూరి పండు మరణించారు. ఆయనది భీమవరం. రావూరి పండు మృతికి సంతాపంగా, ఆయనకు నివాళులు అర్పిస్తూ 'విరూపాక్ష' టీజర్ విడుదల వాయిదా వేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. 


ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌...
గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్!
''అజ్ఞానం భయానికి మూలం... భయం మూఢ నమ్మకానికి కారణం... ఆ నమ్మకమే నిజమైనప్పుడు? ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు? అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం'' అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో 'విరూపాక్ష' గ్లింప్స్‌ విడుదలైంది. సాయి ధరమ్ తేజ్ పాత్రను తారక్ తన వాయిస్ ద్వారా పరిచయం చేసిన తీరు వల్ల ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది. విజువల్స్ కూడా బావున్నాయి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 


ఏప్రిల్ 21న పాన్ ఇండియా రిలీజ్!
'విరూపాక్ష' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా '' సినిమాను రూపొందిస్తున్నారు. దీనికి కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సుకుమార్ శిష్యుడు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి సుకుమార్ కథ, కథనం అందించారు. హీరోగా సాయి ధరమ్ తేజ్ 15వ సినిమా ఇది.
 
Also Read : రజనీకాంత్ 'లాల్ సలాం'లో జీవిత రాజశేఖర్ - రోల్ ఏంటంటే?


B Ajaneesh Loknath Telugu Movies : బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కాంతార' (Kantara) కు ఆయన సంగీతం అందించారు. ఆ సినిమా విజయంలో సంగీతం ఎంత కీలక పాత్ర పోషించిందో... మన అందరికీ తెలిసిందే. తెలుగులో అజనీష్‌కు రెండో చిత్రమిది. ఇంతకు ముందు 'నన్ను దోచుకుందువంటే' చిత్రానికి సంగీతం అందించారు. తెలుగులో డబ్బింగ్ అయిన కన్నడ సినిమాలకు మ్యూజిక్ అందించారు.  


Also Read ఆస్కార్స్‌లో 'నాటు నాటు' - స్టేజిపై తెలుగు పోరగాళ్ళ లైవ్ పెర్ఫార్మన్స్ 


ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు 'భీమ్లా నాయక్'లో రానా దగ్గుబాటి జోడీగా నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' సినిమాలో కూడా ఓ కథానాయికగా ఎస్సై పాత్రలో కనిపించారు. తాజాగా ధనుష్ 'సార్'లో హీరోయిన్ కూడా ఆమె. సాయి చంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి తేజ్‌కు రోడ్ యాక్సిడెంట్ కావడానికి ముందు ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ ప్రమాదం వల్ల కొన్ని రోజులు బ్రేక్ పడింది. మళ్ళీ ఆయన కోలుకున్నాక షూటింగ్ రీ స్టార్ట్ చేశారు. కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి హైదరాబాద్‌లో రెండు సెట్స్ వేశారు. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యిందని సమాచారం.