సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'లాల్ సలాం'. ఇందులో నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) కూడా నటిస్తున్నారు. సినిమాలో ఆమెది కీలక పాత్ర!


రజనీ సోదరిగా జీవిత
'లాల్ సలాం'లో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఎంత సేపు తెరపై కనిపిస్తారు? అనేది పక్కన పెడితే... కథలో ఆయన పాత్రకు చాలా ప్రాముఖ్యం చాలా ఉంటుందని సమాచారం. రజనీ సోదరిగా జీవితా రాజశేఖర్ కనిపించనున్నారు. 


చెన్నైలో మార్చి 7 నుంచి!
'లాల్ సలాం' చిత్రీకరణలో మార్చి 7 నుంచి జీవిత పాల్గొంటారు. షూటింగ్ కోసం ఆమె చెన్నై వెళ్ళనున్నారు. రజనీకాంత్, జీవితా రాజశేఖర్ తదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి ఐశ్వర్యా రజనీకాంత్ ప్లాన్ చేశారట. 


ఈ సినిమాలో హీరోలు ఎవరంటే?
రజనీకాంత్ స్పెషల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ సంతోష్ (Vikranth Santhosh) హీరోలు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. పోలీస్ నేపథ్యంలో రూపొందిస్తోన్న యాక్షన్ డ్రామా సినిమా ఇదని టాక్. 


ఐశ్వర్యకు హిట్ వచ్చేనా?
దర్శకురాలిగా ఐశ్వర్యకు నాలుగో చిత్రమిది. దీంతో అయినా హిట్ వస్తుందో? లేదో? చూడాలి. ఎందుకంటే... ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన '3' సినిమాతో ఆవిడ మెగాఫోన్ పట్టుకున్నారు. దర్శకురాలిగా తొలి సినిమా సక్సెస్ కాలేదు. కానీ, అందులో 'వై థిస్ కొలవెరి డి' సూపర్ హిట్ అయ్యింది. అనిరుధ్ రవిచంద్రన్ ఆ తర్వాత స్టార్ అయ్యారు. '3' తీశాక... మరో సినిమా 'వై రాజా వై', డాక్యుమెంటరీ 'సినిమా వీరన్'  తీశారు. ఆ రెండు కూడా హిట్ కాలేదు. కిప్పుడు ఏకంగా తండ్రి రజనిని ప్రత్యేక పాత్రలో పెట్టి సినిమా తీస్తున్నారు. 


Also Read : ఆస్కార్స్‌లో 'నాటు నాటు' - స్టేజిపై తెలుగు పోరగాళ్ళ లైవ్ పెర్ఫార్మన్స్


ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా రూపొందిన మ్యూజిక్ వీడియోకి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 'సంచారి...' అంటూ సాగిన ఆ గీతానికి అంకిత్ తివారి సంగీతం అందించారు. దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఆలపించారు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా విషయానికి వస్తే... 'కొలమావు కోకిల', 'వరుణ్ డాక్టర్', 'మాస్టర్' తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' చేస్తున్నారు. అందులో శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు ప్రధాన తారాగణం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు శివన్న ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. 'పుష్ప'లో విలనిజం పండించిన సునీల్, మరోసారి 'జైలర్'లో కూడా విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా నటిస్తున్నారు. 'లాల్ సలాం'తో పాటు 'జైలర్' (Jailer Movie) మీద భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.


Also Read అమెరికాలో కాదు, అపోలోలో ఉపాసన డెలివరీ - ఇండియన్ డాక్టర్లకు తోడు అమెరికన్ గైనకాలజిస్ట్