మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) త్వరలో తండ్రి కానున్నారు. ఆయన సతీమణి ఉపాసన కామినేని కొణిదెల (Upasana) త్వరలో పండంటి బిడ్డకు జన్మ ఇవ్వనున్నారు. అయితే, ఉపాసన డెలివరీ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో, అదీ అపోలోలో అని చెప్పాలి. ఇటీవల ఓ అమెరికన్ టీవీ షోలో రామ్ చరణ్ సందడి చేశారు. అక్కడ జరిగిన సంభాషణ బట్టి అమెరికాలో డెలివరీకి ప్లాన్ చేస్తున్నారని చాలా మంది భావించారు. నిజం ఏంటంటే... ఇండియాలోనే డెలివరీ ప్లాన్ చేస్తున్నారు.
ఉపాసన డెలివరీకి ఫేమస్ అమెరికన్ గైనకాలజిస్ట్!
ఇప్పుడు రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. గత బుధవారం (ఫిబ్రవరి 22న) 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొన్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా, అందులోని 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం, ఆస్కార్ నామినేట్ కావడం వంటి అంశాలతో పాటు షోలో రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. త్వరలో ఆయన తండ్రి కానున్న నేపథ్యంలో ఆ ప్రస్తావన కూడా వచ్చింది.
అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో కో హోస్ట్! ఆమెను కలవడం సంతోషంగా ఉందని చెప్పిన చరణ్... ఫోన్ నంబర్ తీసుకుంటానని పేర్కొన్నారు. తన భార్య (ఉపాసన) అమెరికా వస్తుందని, డెలివరీకి తమరు అందుబాటులో ఉంటే బావుంటుందని జెన్నిఫర్ ఆస్టన్ (Jennifer Ashton) తో చరణ్ తెలిపారు. అందుకు జెన్నిఫర్ ఒకే అన్నారు. ''మీతో ట్రావెల్ చేయడానికి రెడీ. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడం నాకు గౌరవమే'' అని ఆమె పేర్కొన్నారు.
జెన్నిఫర్ ఆస్టన్ టూ స్వీట్ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. త్వరలో ఆమెను కలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇండియాలోని అపోలో ఆస్పత్రుల కుటుంబంలో డాక్టర్లు సుమనా మనోహర్, రూమా సిన్హాతో కలిసి డెలివరీ చేయమని రిక్వెస్ట్ చేశారు. అందుకు జెన్నిఫర్ ఓకే చెప్పారు. సో, అపోలోలో ఉపాసన డెలివరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట. అదీ సంగతి!
Also Read : అమ్మాయిని కొడతావా? నడిరోడ్డు మీద నిలదీసిన రియల్ హీరో నాగశౌర్య
రామ్ చరణ్, ఉపాసన వివాహం జూన్ 14, 2012న జరిగింది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుక వైభవంగా జరిగింది. పెళ్ళైన పదేళ్ళకు వాళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇన్నేళ్ళు ఎందుకు తల్లిదండ్రులు కాలేదనే ప్రశ్న ఆయనకు షోలో ఎదురు కాలేదు. కానీ, ఆయన చెప్పిన ఓ మాట ఆ ప్రశ్నకు సమాధానంగా భావించవచ్చు. తాము ఎప్పుడూ ప్లాన్ చేయలేదని రామ్ చరణ్ పేర్కొన్నారు.
Also Read : షాకింగ్, సమంతకు గాయాలు? రక్తం కారుతున్న చేతులతో ఇన్‌స్టా పోస్ట్
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడు ఉపాసన ఎమోషనల్ పోస్ట్ చేశారు. ''ఆర్ఆర్ఆర్' చిత్ర బృందంలో నేనూ ఓ భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలోని పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం దేశం గర్వించదగిన విషయం. ఈ అవార్డు వేడుకల్లో నాతో పాటు నా కడుపులో ఉన్న బిడ్డ కూడా అనుభూతి పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలు ఎంతో మధురంగా, భావోద్వేగంగా ఉన్నాయి'' అని ఆమె పేర్కొన్నారు.