ఇప్పుడు ప్రపంచంలో డ్యాన్స్, మూవీ లవర్స్ అందరినీ ఏకం చేసిన పాట ఏదైనా ఉందంటే... అది 'నాటు నాటు' అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. అనకాపల్లి నుంచి అమెరికా వరకు, భీమవరం నుంచి బ్రెజిల్ వరకు, జనగాం నుంచి జపాన్ వరకు... ప్రతి ఏరియాలో ప్రేక్షకులు ఈ పాటకు స్టెప్పులు వేశారు. ఆ సాంగ్ అంత పాపులర్ అయ్యింది మరి!


ఆస్కార్స్ వేదికపై రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NT Rama Rao Jr) కాంబినేషన్, వాళ్ళ యాక్టింగ్ ఎంతో మందిని ఆకట్టుకుంది. సినిమాలో వాళ్ళిద్దరి యాక్టింగ్ ఒక హైలైట్ అయితే, 'నాటు నాటు...'లో చేసిన డ్యాన్స్ మరో హైలైట్! ఈ పాటకు ఆస్కార్ నామినేషన్ లభించింది. ఆస్కార్స్ లైవ్ షోలో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. అంతకు మించి? అనేలా ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ చేయనున్నారు. 


లైవ్ పెర్ఫార్మన్స్ కన్ఫర్మ్ చేసిన రామ్ చరణ్ 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డుల కార్యక్రమంలో సందడి చేసిన రామ్ చరణ్, ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. లేటెస్టుగా ఇచ్చిన ఇంటర్వ్యూలో లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నట్లు రామ్ చరణ్ కన్ఫర్మ్ చేశారు. 


ఆస్కార్స్, లైవ్ పెర్ఫార్మన్స్ గురించి మీడియా ప్రతినిథి ప్రశ్నించగా... ''ప్రేక్షకులు మాపై ఎంతో ప్రేమ చూపించారు. సినిమాను ఎంతో ఆదరించారు. సాంగుకు పెర్ఫార్మన్స్ చేయడం ద్వారా ప్రేక్షకులకు మా ప్రేమను చూపించాలని అనుకుంటున్నాం. ప్రేక్షకులకు ఇది ట్రిబ్యూట్'' అని రామ్ చరణ్ పేర్కొన్నారు. 






అసలైన 'నాటు నాటు...' మూమెంట్ అంటే ఇది కదా!
రామ్ చరణ్, ఎన్టీఆర్ లైవ్‌లో డ్యాన్స్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. వరల్డ్ వైడ్ ఆడియన్స్‌కు ఫీస్ట్ అని చెప్పాలి. ఇది కదా అసలైన 'నాటు నాటు...' మూమెంట్ అని ఆడియన్స్ పేర్కొంటున్నారు. 


Also Read : సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మృతి - 'విరూపాక్ష' టీజర్ విడుదల వాయిదా


'నాటు నాటు...'కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్... ఇద్దరికీ ఆ అవార్డును సంయుక్తంగా ఇచ్చారు. గోల్డెన్ గ్లోబ్ వేదికపై కీరవాణి సగర్వంగా ఆ పురస్కారాన్ని సగర్వంగా అందుకున్నారు. అంతకు ముందు ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ, క్రిటిక్స్ ఛాయస్ మూవీ అవార్డ్స్ నుంచి ఉత్తమ పాటగా 'నాటు నాటు...'కు అవార్డు వచ్చింది. 


మార్చి 13 కోసం ఇండియా వెయిటింగ్!
మార్చి 13, 2023న ఆస్కార్ విజేతల వివరాలు వెల్లడిస్తారు. ఆ రోజు కోసం యావత్ భారతదేశం వెయిట్ చేస్తోంది. 'నాటు నాటు...'కు అవార్డు రావడం ఖాయం అని అభిమానులు ఆశిస్తున్నారు. 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో పోటీ పడటానికి మొత్తం 81 పాటలు అర్హత సాధించగా... అందులో 15 పాటలను మాత్రమే షార్ట్ లిస్టుకు ఎంపిక చేశారు. ఆ పదిహేనులో 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత నామినేషన్ కూడా అందుకుంది.


Also Read : రజనీకాంత్ 'లాల్ సలాం'లో జీవిత రాజశేఖర్ - రోల్ ఏంటంటే?


'నాటు నాటు...'కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ సంగీతానికి గాను ఎం.ఎం. కీరవాణి అవార్డు అందుకున్నారు. ఆయనకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా అవార్డు ఇచ్చారు. అయితే, అందరి చూపు ఆస్కార్ అవార్డు మీద ఉంది. ఎందుకు అంటే... ప్రపంచ సినిమాలో అన్ని అవార్డులకు పెద్దన్నగా అకాడమీ పురస్కారాలను చూస్తారు కాబట్టి!