మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుమారుడిగా రామ్ చరణ్ (Ram Charan) తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. రెండో సినిమా 'మగధీర'తోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాదు... తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. 'రంగస్థలం' సినిమాతో నటుడిగా మరింత ఎత్తుకు ఎదిగారు. 'ఆర్ఆర్ఆర్'తో రామ్ చరణ్ పేరు (Ram Charan Global Recognition) అంతర్జాతీయ స్థాయిలో వినబడుతోంది.
చరణ్‌ను ఆకాశమంత ఎత్తులో చూస్తున్న అమెరికన్ మీడియా
ఇప్పుడు రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను అమెరికన్ మీడియా ఆయన్ను ఆకాశం అంత ఎత్తులో చూస్తోంది. ఆయన్ను హాలీవుడ్ హీరోలతో పోలుస్తోంది. రామ్ చరణ్ ప్రతిభ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాదు... ఆయన్ను 'బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా'గా పేర్కొంటోంది.
'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొన్న రామ్ చరణ్... ఏబీసీ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు లేటెస్టుగా KTLA5 న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళు 'బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా'గా చరణ్‌ను పరిచయం చేశారు. అదీ సంగతి! KTLA5 న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆస్కార్స్ స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నట్లు రామ్ చరణ్ తెలిపారు.
ఆస్కార్స్, లైవ్ పెర్ఫార్మన్స్ గురించి మీడియా ప్రతినిథి ప్రశ్నించగా... రామ్ చరణ్ ''ప్రేక్షకులు మాపై ఎంతో ప్రేమ చూపించారు. సినిమాను ఎంతో ఆదరించారు. సాంగుకు పెర్ఫార్మన్స్ చేయడం ద్వారా ప్రేక్షకులకు మా ప్రేమను చూపించాలని అనుకుంటున్నాం. ప్రేక్షకులకు ఇది ట్రిబ్యూట్'' అని చెప్పారు.
Also Read : సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మృతి - 'విరూపాక్ష' టీజర్ విడుదల వాయిదా
చరణ్ పక్కన నిలబడటమే అవార్డు
ఇటీవల 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డుల్లో రామ్ చరణ్ సందడి చేశారు. అవార్డు అందుకోవడం కోసం కాదు... స్టేజి మీద ఆయనొక అవార్డు అనౌన్స్ చేసి ఇచ్చారు కూడా! 'బెస్ట్ వాయిస్ ఆర్ మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్' కేటగిరీలో అవార్డు అనౌన్స్ చేయడానికి ఆయనతో పాటు హాలీవుడ్ నటి అంజలి భీమని వేదిక మీదకు వెళ్ళారు. ఆయన పక్కన ప్రజెంటర్‌గా నిలబడటమే అవార్డ్ విన్నింగ్ మూమెంట్ అని అని అంజలీ చెప్పారు. అందుకు బదులుగా రామ్ చరణ్ ఆమెకు థాంక్స్ చెప్పారు, నమస్కరించారు.
'నాటు నాటు...' చరణ్ నేర్పిస్తే?
హెచ్.సి.ఎ అవార్డుల వేదికపై కూడా 'నాటు నాటు...' సాంగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేసిన స్టెప్పుల గురించి డిస్కషన్ నడిచింది. ఆ సాంగులో హీరోలు చేసినట్టు డ్యాన్స్ చేయాలని ఉందని క్రిటిక్స్ మెంబర్ ఒకరు వ్యాఖ్యానించగా... ''రామ్ ఇక్కడ ఉన్నాడు కాదు! మనకు నేర్పిస్తాడు'' అని రాషా గోయెల్ తెలిపారు. రామ్ చరణ్ స్టైల్ కూడా డిస్కషన్ పాయింట్ అయ్యింది.
Also Read : రజనీకాంత్ 'లాల్ సలాం'లో జీవిత రాజశేఖర్ - రోల్ ఏంటంటే?
ఇప్పుడు ఆస్కార్ అవార్డుల మీద అందరి చూపు, ముఖ్యంగా భారతీయ ప్రేక్షకుల చూపు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఆ అవార్డు వేడుకకు రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి తదితరులు వెళ్ళనున్నారు.