ఛార్మీ కౌర్ నటించిన సినిమాల్లో 'మంత్ర', 'మంగళ' చిత్రాలకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ఎక్కువ రావడానికి కారణం ఆ రెండు సినిమాలు అని చెప్పాలి. కథ, కథనం, దర్శకత్వం విషయంలో ట్రెండ్ సెట్ చేసిన ఆ సినిమాలకు ఓషో తులసీరామ్ (Osho Tulasi Ram) దర్శకుడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా 'దక్షిణ' (Dakshina Movie). 


'కబాలి'లో రజనీకాంత్ కుమార్తె పాత్రలో నటించిన సాయి ధన్సిక (Sai Dhanshika) గుర్తున్నారు కదా! 'దక్షిణ' (Dakshina Movie 2023) సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.


45 రోజుల్లో 'దక్షిణ' పూర్తి!
'దక్షిణ' సినిమా చిత్రీకరణను 45 రోజుల్లో పూర్తి చేసినట్లు చిత్ర నిర్మాత అశోక్ షిండే తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఇదొక సైకో థ్రిల్లర్. సినిమాలో ఎమోషన్స్  హైలైట్ అవుతాయి. హైదరాబాద్, విశాఖపట్నం, గోవాలో చిత్రీకరణ చేశాం. ఓషో తులసీరామ్ తీసిన 'మంత్ర', 'మంగళ' సినిమాల తరహాలో 'దక్షిణ' కూడా ట్రెండ్ సెట్ చేస్తుంది'' అని చెప్పారు. త్వరలో సినిమా సెన్సార్ పూర్తి చేసి, ఆ తర్వాత మంచి విడుదల తేదీ చూసుకుని ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
ఐపీఎస్ అధికారిగా సాయి ధన్సిక
'దక్షిణ'లో సాయి ధన్సిక పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని దర్శకుడు ఓషో తులసీరామ్ చెప్పారు. ఆమె ఐపీఎస్ అధికారి పాత్ర చేసినట్లు తెలిపారు. 'దక్షిణ' విడుదల తర్వాత సాయి ధన్సికకు మరింత పేరు వస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. 


Also Read : ఇదీ 'నాటు నాటు' మూమెంట్ అంటే - ఆస్కార్స్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లైవ్ డ్యాన్స్


ఇంతకు ముందు విడుదల చేసిన 'దక్షిణ' మోషన్ పోస్టర్ విషయానికి వస్తే... సముద్ర తీరంలో ఉన్న సాయి ధన్సికను చూపించారు. నేపథ్య సంగీతం శక్తివంతంగా ఉంది. బహుశా... టైటిల్ సాంగ్ మ్యూజిక్ కావచ్చు. సాధారణంగా ధన్సిక పేరు చెబితే 'కబాలి' గుర్తుకు వస్తుంది. కానీ, ఈ సినిమా తర్వాత 'దక్షిణ' ఫేమ్ ధన్సిక అంటారని నిర్మాత అశోక్ షిండే చెబుతున్నారు.


విలన్‌గా బెంగాలీ హీరో రిషవ్ బసు!  
'దక్షిణ' సినిమాలో బెంగాలీ హీరో రిషవ్ బసు విలన్‌గా నటిస్తున్నట్లు నిర్మాత అశోక్ షిండే తెలిపారు. బెంగాలీ నుంచి కథానాయికలు, నటులు తెలుగుకు రావడం కొత్త కాదు. 'సిరివెన్నెల', 'స్వయం కృషి', ఇటీవల 'గాడ్ ఫాదర్' సినిమాల్లో నటించిన సర్వాధామన్ డి బెనర్జీ బెంగాలీ. ఈ మధ్య తెలుగులో ఎక్కువ విలన్ రోల్స్ చేస్తున్న జిష్షు సేన్ గుప్తా కూడా బెంగాలీ. ఇప్పుడు రిషవ్ బసు వస్తున్నారు. ఆయనకు, సాయి ధన్సిక మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయట.


Also Read సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మృతి - 'విరూపాక్ష' టీజర్ విడుదల వాయిదా 


'దక్షిణ' సినిమాలో కనిపించబోయే ఇతర నటీనటులు, సినిమాకు పని చేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సాయి ధన్సిక, రిషబ్ బసు, సుభాష్, ఆనంద భారతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : నర్సింగ్, సంగీతం : బాలాజీ, నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్, నిర్మాత : అశోక్ షిండే, దర్శకత్వం : ఓషో తులసీరామ్.