ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venu Swamy Astrologer)కి సినిమా ఇండస్ట్రీలో, మరీ ముఖ్యంగా హీరోయిన్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. తమకు వరుస విజయాలు దక్కాలని ఆయనతో ప్రత్యేక పూజలు, హోమాలు చేయించుకోవడం కొన్నాళ్ల నుంచి జరుగుతోంది. రష్మిక నుంచి మొదలు పెడితే నిధి అగర్వాల్, డింపుల్ హయతి వరకు పలువురు వేణు స్వామితో పూజలు చేయించుకున్న వారే. ఇప్పుడీ జాబితాలో తెలుగమ్మాయి, హీరోయిన్ అనన్యా నాగళ్ళ కూడా చేరారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'తంత్ర' ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ తరుణంలో ఆమె కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


క్షుద్ర పూజల కథతో తెరకెక్కిన 'తంత్ర'...
వేణు స్వామి ఏం పూజలు చేసి ఉంటారు?
అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి జంటగా నటించిన సినిమా 'తంత్ర'. ఇందులో సలోని, 'టెంపర్' వంశీ, మీసాల లక్ష్మణ్ (ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాల ఫేమ్) ఇతర ప్రధాన తారాగణం. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ సంస్థలపై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మాణంలో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు.


క్షుద్ర పూజల నేపథ్యంలోని కథతో 'తంత్ర' తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఆ సినిమా విజయం సాధించాలని వేణు స్వామి ఎటువంటి పూజలు చేశారో అని నెటిజనులు సరదాగా చర్చించుకుంటున్నారు. అప్పట్లో ఓ తెలుగు ముఖ్యమంత్రి కూడా ఈ తాంత్రిక సాధన చేశారని బాగా పుకార్లు వచ్చాయని మీసాల లక్ష్మణ్ ట్రైలర్ చివర్లో చెప్పిన డైలాగ్ వైరల్ అయ్యింది.


Also Readఆస్కార్స్‌ చరిత్రలో 56 నామినేషన్లు, 21 అవార్డులు - ఇదీ క్రిస్టోఫర్ నోలన్ ఘనత, 'ఓపెన్ హైమర్' ఒక్కటే కాదు!


''మహిళా ప్రాధాన్య చిత్రమిది. ఫిమేల్ ఓరియెంటెడ్ హారర్‌ ఎంటర్‌టైనర్‌. పురాణ  గాథలు, భారతీయ తాంత్రిక శాస్త్రం నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగే చిత్రమిది'' అని దర్శక నిర్మాతలు తెలిపారు. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. వినూత్న ప్రచారం సైతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి, సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


Also Readమాపై యుద్ధం ఆపండి... బదులుగా ఆస్కార్ అవార్డు ఇస్తా - రష్యాకు ఉక్రెయిన్ దర్శకుడు మిస్టిస్లావ్ చెర్నోవ్ ఆఫర్


'తంత్ర' సినిమాలో అనన్యా నాగళ్ల, ధనుష్‌, సలోని, 'టెంపర్‌' వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : ఎస్‌.బి. ఉద్దవ్‌ (భలే భలే మగాడివోయ్‌, మిథునం),  ఛాయాగ్రహణం : సాయి రామ్ ఉదయ్‌ (రాజు యాదవ్‌ ఫేం) - విజయ భాస్కర్ సద్దాల, సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్‌ (క్రేజీ ఫెలో, మైల్స్‌ ఆఫ్‌ లవ్‌), నిర్మాణ సంస్థలు : ఫస్ట్‌ కాపీ మూవీస్‌ - బి ద వే ఫిల్మ్స్‌ - వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, నిర్మాతలు : నరేష్ బాబు పి - రవి చైతన్య, దర్శకత్వం: శ్రీనివాస్‌ గోపిశెట్టి.