హిందీ చిత్రసీమలో స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఖాన్ హీరోలు షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఆయన వరుసపెట్టి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. అటువంటి హీరో నుండి ఇప్పుడు వరుసపెట్టి డిజాస్టర్ సినిమాలు వస్తున్నాయి. ఒక సినిమా తర్వాత మరొక సినిమా... అక్షయ్ కుమార్ చేస్తున్న సినిమాలు అన్నీ డిజాస్టర్లు అవుతున్నాయి. బాక్సాఫీస్ బరిలో వసూళ్ల వేటలో వెనుక బడుతున్నాయి. ఆ లిస్టులోకి లేటెస్ట్ రిలీజ్ 'మిషన్ రాణిగంజ్' (Mission Raniganj Movie) కూడా చేరింది.
అక్షయ్ కుమార్ పరువు తీసిన ఫస్ట్ డే కలెక్షన్స్
Mission Raniganj box office collection day 1 : 'మిషన్ రాణిగంజ్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? రూ. 2.8 కోట్లు మాత్రమే! ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేశారు. అక్షయ్ కుమార్ 'సెల్ఫీ' ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా మూడు కోట్ల రూపాయల లోపే!
ఇంతకు ముందు అక్షయ్ సరసన కొన్ని సినిమాల్లో నటించిన భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన అడల్ట్ కామెడీ 'థాంక్యూ ఫర్ కమింగ్' కూడా ఈ శుక్రవారం విడుదల అయ్యింది. ఆ సినిమాను లిమిటెడ్ స్క్రీన్లు మాత్రమే ఇచ్చారు. అయినా సరే కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. స్టార్లు ఎవరూ లేని తెలుగు సినిమా 'మ్యాడ్'కు మొదటి రోజు 1.8 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దానికి డబుల్ కూడా అక్షయ్ సినిమా కలెక్ట్ చేయలేకపోయింది.
ఫ్లాపుల్లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్న అక్షయ్
అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు గత ఏడాది ఐదు విడుదల అయ్యాయి. అవి అన్నీ ఫ్లాపులే! ఈ ఏడాది ప్రారంభంలో 'సెల్ఫీ' కూడా ఫ్లాపే. అయితే... మధ్య 'ఓ మై గాడ్ 2' కొంత ఊరట ఇచ్చింది. భారీ వసూళ్లు సాధించిన 'గద్దర్ 2', అక్షయ్ సినిమా ఒకే రోజు విడుదల అయ్యాయి. ఆ పోటీలో కూడా 'ఓ మై గాడ్ 2' వంద కోట్లకు పైగా వసూలు చేసింది. అందులో సగం అయినా 'మిషన్ రాణిగంజ్' కలెక్ట్ చేస్తుందో? లేదో? ఓపెనింగ్స్ చూస్తే సందేహంగా ఉన్నాయి. వరుస ఫ్లాపులతో అక్షయ్ కుమార్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసేలా ఉన్నారు.
Also Read : 'యానిమల్'లో రణబీర్, రష్మిక ఫస్ట్ నైట్ అంత వయలెంట్‌గా ఉంటుందా?
షారుఖ్ ఖాన్ సైతం ఒకానొక సమయంలో భారీ పరాజయాలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయన బ్రేక్ తీసుకుని, పరిస్థితులను అంచనా వేసి కొత్త సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. 'పఠాన్', 'జవాన్'తో భారీ విజయాలు అందుకున్నారు. అక్షయ్ ఆ విధంగా చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు అయినా విడుదల చేయాలని వరుసపెట్టి సినిమాలు చేయడంతో కథల్లో, సినిమాలు చేయడంలో క్వాలిటీ లేకుండా పోతుందని వాపోతున్నారు.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేతిలో ఓ మరాఠి సినిమాతో పాటు నాలుగైదు హిందీ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఎన్ని హిట్ అవుతాయి? ఎన్ని ఫ్లాప్ అవుతాయి? అనేది చూడాలి.
Also Read : భార్య ఉండగా మరొక అమ్మాయితో - ఎఫైర్ రివీల్ చేసిన ఈటీవీ ప్రభాకర్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial