మెగా ఇంట పెళ్లి సంబరం మొదలైంది. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ (Varun Tej), సొట్ట బుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు. అయితే.... శుక్రవారం రాత్రి చిరు ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. 


కుటుంబ సభ్యులకు కోడల్ని పరిచయం చేసిన చిరంజీవి
మెగా కుటుంబ సభ్యులకు లావణ్యా త్రిపాఠి తెలుసు. కథానాయికగా ఆమె చేసిన సినిమాలు చూశారు. వరుణ్ తేజ్ కాకుండా అల్లు శిరీష్ సరసన ఓ సినిమా చేశారు. గీతా ఆర్ట్స్ నిర్మించిన సినిమాల్లో నటించారు. వినాయక చవితి నాడు నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పూజలు చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా! పెళ్ళికి ముందు అత్తారింట్లో అందరికీ లావణ్య తెలుసు.


అయితే... శుక్రవారం జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లలో లావణ్య త్రిపాఠిని కోడలిగా కుటుంబ సభ్యులకు చిరు పరిచయం చేసినట్టు ఆయన ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 


చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ ఫ్యామిలీస్ కూడా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లకు అటెండ్ అయ్యారు. రామ్ చరణ్ & ఉపాసన దంపతులతో పాటు సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, నిహారిక తదితరులను ఈ ఫొటోల్లో చూడవచ్చు.  


Also Read 'యానిమల్'లో రణబీర్, రష్మిక ఫస్ట్ నైట్ అంత వయలెంట్‌గా ఉంటుందా?






జూన్ 9న వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం జరిగింది. 'మిస్టర్' సినిమాలో వాళ్లిద్దరూ తొలిసారి జంటగా నటించారు. ఆ తర్వాత 'అంతరిక్షం' సినిమాలో మరోసారి ఈ జంట సందడి చేసింది. ముందు తానే ప్రపోజ్ చేసినట్లు వరుణ్ తేజ్ ఓసారి చెప్పారు. జీవితంలో సరైన సమయంలో తాను సరైన వ్యక్తిని కలిసినట్టు ఆయన పేర్కొన్నారు. లావణ్య తనకు మంచి స్నేహితురాలని, ఆరేళ్ళ తమ పరిచయాన్ని మరోమెట్టు ఎక్కించాలని భావించినట్లు ఆయన వివరించారు.
 
ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరు? లావణ్యనా? లేదంటే మీరు ప్రపోజ్ చేశారా? అని అడిగితే... ''నేనే'' అని వరుణ్ తేజ్ బదులు ఇచ్చారు. పెళ్లి ఎక్కడ చేసుకుంటున్నారు? అని అడిగితే మాత్రం ఆయన చెప్పలేదు. ఇటలీలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని వినిపిస్తోందని గుర్తు చేయగా... ''అది ఒక ఆప్షన్ మాత్రమే'' అని చెప్పారు. పెళ్లి వేదికను ఇంకా ఖరారు చేయలేదని ఆయన తెలిపారు. 


Also Read భార్య ఉండగా మరొక అమ్మాయితో - ఎఫైర్ రివీల్ చేసిన ఈటీవీ ప్రభాకర్


వరుణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు వస్తే... 'ఆపరేషన్ వేలంటైన్' షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ సినిమా డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ 50 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు కావడం గమనార్హం. 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమా 'మట్కా' చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial