నటుడు ప్రభాకర్ (Actor Prabhakar)ను తెలుగు బుల్లితెర వీక్షకులకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. టీవీ ఇండస్ట్రీలో మెగాస్టార్ అని ఆయనకు పేరు ఉంది. కొన్నేళ్లుగా సూపర్ డూపర్ హిట్ సీరియల్స్ చేస్తూ తనకు అంటూ గుర్తింపు, గౌరవం తెచ్చుకున్నారు ప్రభాకర్. 'ఈటీవీ' ప్రభాకర్ అంటే ఆయనను ఎక్కువ మంది గుర్తు పట్టవచ్చు. తన జీవితంలో చేసిన తప్పు గురించి తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో ఆయన రివీల్ చేశారు. అసలు వివరాల్లోకి వెళితే... 


భార్యను బాధ పెట్టాను : 'ఈటీవీ' ప్రభాకర్‌
ప్రభాకర్ సతీమణి మలయజ (ETV Prabhakar Wife Malaija) సైతం ఈ మధ్య టీవీ షోలకు వస్తున్నారు. ఆదివారం స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' కార్యక్రమానికి దంపతులు ఇద్దరూ వచ్చారు. మాటలో మధ్యలో తన భార్యను బాధ పెట్టిన సందర్భం ఒకటి ఉందని ఆయన చెప్పారు. 


''తెలిసీ తెలియక చాలా బాధ పెట్టిన సందర్భం ఒకటి ఉంది. నాకు ఒక గాళ్ ఫ్రెండ్ ఉండేది. ఆ విషయంలో నా భార్య చాలా బాధ పడింది. దానిని నేను ఎలాగో సరి చేసుకుని మనస్ఫూర్తిగా సారీ చెప్పాను. నేను సారీ చెప్పడం పెద్ద గొప్ప గుణం కాదు. తను క్షమించడం అనేది గొప్ప విషయం'' అని ప్రభాకర్ చెప్పారు. ఆ తర్వాత తన భార్యను బుగ్గపై ఆత్మీయంగా ముద్దు పెట్టుకున్నారు. పెళ్లి తర్వాత వేరొక అమ్మాయితో తిరిగిన విషయాన్ని ప్రభాకర్ ఒప్పుకోవడం కూడా గొప్ప విషయం అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అసలు ఈ మ్యాటర్ ఎందుకు బయటకు వచ్చిందంటే?


దొంగ పెళ్లి చేసుకున్నాం : ఈటీవీ ప్రభాకర్‌
తమ పెళ్లి ఆర్య సమాజ్ లో జరిగిందని ఈటీవీ ప్రభాకర్ తెలిపారు. పెళ్ళిలో తమ బంధువులు ఎవరూ లేరని వివరించారు. స్నేహితులు, తెలిసిన వాళ్ళ సమక్షంలో వివాహం చేసుకున్నామని వివరించారు. ఖమ్మం నుంచి వచ్చిన ఓ స్నేహితుడు కన్యాదానం చేశారని వివరించారు. ఇంకా ఏం చెప్పారనేది తెలియాలంటే... రేపు టీవీలో టెలికాస్ట్ అయ్యే షో చూడాలి. 


Also Read : 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ : 'కలర్స్' స్వాతి బోల్డ్ సీన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?



ప్రభాకర్ కుమారుడు త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. ఆ విషయం చాలా మంది ప్రేక్షకులకు తెలుసు. వాళ్ళ అబ్బాయి డ్యాన్స్, స్పీచ్ వీడియోస్ వైరల్ అయ్యాయి. అయితే... ఇంకా సినిమా విడుదల కాలేదు. త్వరలో ప్రేక్షకుల ముందుకు  వచ్చే అవకాశం ఉంది. 


Also Read :'మామా మశ్చీంద్ర' రివ్యూ : సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ హిట్టా? ఫట్టా?



ఈటీవీ ప్రభాకర్ దంపతులతో పాటు జాకీ దంపతులు 'కార్తీక దీపం' సీరియల్ ఫేమ్ నిరుపమ్ పరిటాల దంపతులు, కమెడియన్ యాదమ్మ రాజు దంపతులు ఈ షోకి అటెండ్ అయ్యారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial