మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'మట్కా'. ఆయనకు ఫస్ట్ పాన్ ఇండియా చిత్రమిది. దీనికి 'పలాస', 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాల ఫేమ్ కరుణ కుమార్ దర్శకుడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్ళూరి నిర్మాతలు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమా ఆడియో రైట్స్ తీసుకుంది.
'మట్కా' ఆడియో రైట్స్ @ 3.6 కోట్లు!
'మట్కా' సినిమాకు జాతీయ అవార్డు పురస్కార గ్రహీత, ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మాతలు రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తున్న తీరు, వరుణ్ తేజ్ అండ్ జీవీ ప్రకాష్ కుమార్ కాంబినేషన్ వంటివి దృష్టిలో పెట్టుకుని 'మట్కా' ఆడియో హక్కుల్ని రూ. 3.6 కోట్లు ఇచ్చి తీసుకుంది.
Also Read: ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్, సిద్ధూ, నిర్మాతలు... వరద బాధితుల సహాయార్థం ఎవరెంత విరాళం ఇచ్చారంటే?
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలో సంగీతమూ...
విశాఖ నేపథ్యంలో 'మట్కా' తెరకెక్కుతుంది. ఈ సినిమా కథ 1958 నుంచి 1982 వరకు జరుగుతుందని దర్శక నిర్మాతలు ఆల్రెడీ తెలిపారు. కథానుగుణంగా... వరుణ్ తేజ్ లుక్ కూడా మారుతుంది. ఆయన డిఫరెంట్ లుక్ మెగా అభిమానులు, ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిసింది. కథా నేపథ్యం, మట్కా ఆట వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సంగీతం అందిస్తున్నారట జీవీ ప్రకాష్ కుమార్.
ఇటీవల 'మట్కా' చిత్రీకరణ కాకినాడలో జరిగింది. అందులో ప్రధాన తారాగణం మీద కొంత టాకీ పార్ట్, అలాగే యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ కీలక తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: కార్తీక శ్రీనివాస్ ఆర్, ప్రొడక్షన్ డిజైనర్: కిరణ్ కుమార్ మన్నె, సీఈఓ: ఈవీవీ సతీష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ఆర్కే జానా - ప్రశాంత్ మండవ - సాగర్, ఛాయాగ్రహణం: ఎ కిషోర్ కుమార్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థలు: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల - రజనీ తాళ్లూరి, కథ - కథనం - మాటలు - దర్శకత్వం: కరుణ కుమార్.