ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, విపత్తు ముంచెత్తినా... తమ వంతు సాయం చేయడానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఎల్లప్పుడూ ఓ అడుగు ముందు ఉంటారు. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితుల సహాయార్థం చేపట్టే చర్యల కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరొక 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆయన తర్వాత మరికొందరు విరాళాలు ప్రకటించారు.


50 లక్షల విరాళం ప్రకటించిన త్రివిక్రమ్, చినబాబు, వంశీ
మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్... ఆయనతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు), సూర్యదేవర నాగవంశీ 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.


Also Readనాలుగు వారాలకే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం' - నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేది ఆ రోజే?






''భారీ వర్షాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు మమ్మల్ని ఎంత గానో కలసి వేశాయి. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తూ... మా వంతు సాయంగా చేయూత అందిస్తున్నాం'' అని త్రివిక్రమ్, చినబాబు, నాగవంశీ పేర్కొన్నారు. 



రెండు తెలుగు రాష్టాలకు రూ. 30 లక్షలు ప్రకటించిన సిద్ధూ
'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్'తో పాటు పలు హిట్ సినిమాలు చేసిన యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన రూ. 30 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 15 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 15 లక్షలు విరాళం ప్రకటించారు. ''ఇది కొంత మందికి అయినా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. మరో యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణకు ఐదేసి లక్షల చొప్పున విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.






Also Read'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే