ప్రముఖ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ తాజాగా గాయాలపాలైంది. ఆమె చేతికి కట్టుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఫోటోని షేర్ చేసిన క్షణాల్లోనే, ఏమైందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 


ఖుష్బూ చేతికి గాయం... 
ఖుష్బూ తన చేతికి గాయం అయిందన్న విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వెల్లడించింది. అయితే ఆ పోస్టులో గాయం ఎలా అయ్యింది? ఎప్పుడు జరిగింది? అసలేం జరిగింది? అనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించకపోవడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కానీ అదే పోస్ట్ లో ఫోటోతో పాటు "అనుకోని గాయాలు మన ప్రయాణాన్ని ఆపాలని చూస్తాయి. కానీ మనం మాత్రం ఆగిపోవద్దు... చిరునవ్వుతో ముందుకు సాగాలి" అంటూ పాజిటివ్ గా రాసుకొచ్చింది. ఖుష్బూ చేసిన ఆ పోస్టులో ఆమె చేతికి కట్టు కట్టి ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇంతటి గాయమైనప్పటికీ ఖుష్బూ ఏమాత్రం టెన్షన్ పడకుండా, చెదరని చిరునవ్వుతో ధైర్యంగా కనిపిస్తుండడం విశేషం. అయితే ఆమెకు ఈ గాయం ఎలా అయింది ? అన్న విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గా మారింది. 






గత ఏడాది కూడా ఇదే పరిస్థితి 
అయితే ఖుష్బూ గత కొన్నాళ్లలో గాయపడడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో కూడా ఖుష్బూ ఓ పిక్ ను షేర్ చేయడంతో, ఆమె గాయపడింది, గాలికి ఫ్రాక్చర్ అయ్యిందనే వార్తలు వైరల్ అయ్యాయి. కాలికి కట్టుతో ఉన్న ఫోటోను షేర్ చేసి, అప్పట్లో అందరినీ టెన్షన్ పెట్టేసింది. ఆ తర్వాత లిగ్మెంట్ సర్జరీ జరిగిందని చెప్పి, కొన్నాళ్లు ఇంట్లోనే రెస్ట్ కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన గాయం నుంచి ఖుష్బూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఖుష్బూను జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు ఆమె అభిమానులు.


Also Read: ఉరి తీసిన 2 గంటల తర్వాత కూడా ఊపిరితో... రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?


జబర్దస్త్ లో జడ్జ్ గా... 
ఇటీవల కాలంలో ఖుష్బూ సినిమాలో జోరు బాగా తగ్గించింది. ఒకప్పుడు తెలుగు, తమిళ అనే భాషతో సంబంధం లేకుండా సౌత్ మొత్తంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు, డైరెక్టర్ - హీరో సుందర్ సితో ప్రేమ, పెళ్లి తర్వాత చాలావరకు సినిమాలు తగ్గించింది. ఇక ఇప్పుడు రాజకీయంగా ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో దూసుకెళ్తోంది. ఒకప్పుడు సినిమాల్లో అదరగొట్టిన ఖుష్బూ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె సోషల్ మీడియాలో ఎదురయ్యే ట్రోలింగ్ పై, అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై వాయిస్ రైజ్ చేస్తుంది. ఇక ఇటీవల కాలంలో సినిమాలు తగ్గించినప్పటికీ, ఈ సీనియర్ హీరోయిన్ బుల్లితెరపై కూడా తన మార్క్ చూపిస్తోంది. పాపులర్ బుల్లితెర షో 'జబర్దస్త్'లో కృష్ణ భగవాన్ తో కలిసి ఆమె వేసే పంచులు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు తాజా పోస్ట్ లో గాయమైనప్పటికీ ఖుష్బూ ఇంట్లోనే రెస్ట్ తీసుకోకుండా, ఎక్కడికో వెళ్తున్నట్టుగా కనిపించింది. ఆ పిక్ వైరల్ గా మారింది. 


Also Readస్టార్ డైరెక్టర్, హీరో అడిగారు... రిజెక్ట్ చేయడంతో అవకాశాలు రానివ్వలేదు - బాంబు పేల్చిన అనసూయ