ఎవరేమనుకుంటారో అనే ఆలోచనను పక్కన పెట్టి, తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతుంది అనసూయ. అలా చెప్పడం వల్ల ఎన్ని వివాదాలు ఎదురైనా , విమర్శలు వచ్చినా డోంట్ కేర్ అంటూ, తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా మొహం మీద చెప్పేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ సినిమా రంగంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడింది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? అనే విషయాన్ని కూడా వెల్లడించింది. 

డైరెక్టర్, హీరోకి నో.... తగ్గిన అవకాశాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ స్టార్ హీరోలకు నో చెప్పడం వల్ల సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయంటూ బాంబ్ పేల్చింది. ఈ విషయమై అనసూయ మాట్లాడుతూ "అమ్మాయిలు - అబ్బాయిల మధ్య అట్రాక్షన్ అనేది కామన్. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఏ రంగంలోనైనా ఇది కామన్ గా మారింది. అయితే అవకాశాల పేరుతో వాడుకోవడానికి చాలామంది హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నా విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఓ స్టార్ హీరో అడిగితే డైరెక్ట్ గా నో చెప్పాను. అలాగే ఓ పెద్ద డైరెక్టర్ ప్రపోజల్ ను కూడా సున్నితంగా తిరస్కరించాను. ఇలా చెప్పడం వల్ల ఆఫర్లు నా వరకు రాలేదు, రానివ్వలేదు వాళ్ళు. అయితే నో చెప్పడమే కాదు, అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కూడా అమ్మాయిలకు ఉంటే మంచిది.

ఇలాంటి వాటికన్నా కళను, మనలో ఉన్న ప్రతిభను చూసి పాత్రలు ఇస్తే బెటర్ అనిపిస్తుంది. ఆమె రాకపోతే ఏం ఈ క్యారెక్టర్ అయితే బాగా చేస్తుంది కదా అని అనుకున్నప్పుడు ఛాన్స్ వస్తే బాగుంటుంది. అలాంటప్పుడే చాలామంది అమ్మాయిలు ఈ రంగంలోకి అడుగు పెడతారు" అంటూ తన కాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది.

Also Readమెగా కోడలు లావణ్య కొత్త సినిమా షురూ... పూజతో 'సతీ లీలావతి' ప్రారంభం

నాపై మీ పెత్తనం ఏంటి ?ఇక ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఈజీవే కరెక్ట్ కాదని వెల్లడించారు. చాలామంది సినిమా రంగంలోకి వచ్చినప్పటికీ, ఇక్కడ పరిస్థితులు డిఫరెంట్ గా ఉంటాయని, ఈజీ వే కోసం వెతుకుతారని వెల్లడించింది. "పదిమంది తప్పు చేస్తున్నారు కదా అని, నేను కూడా చేస్తాను అనడం కరెక్ట్ కాదు. ఈజీ వేలో కాకుండా కష్టాన్ని, కళను నమ్ముకుని ప్రయత్నిస్తే మంచిది. మార్పు మెల్లగా మొదలైంది. టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీలోకి అమ్మాయిలు అడుగు పెడతారు. ఇక సోషల్ మీడియాలో నన్ను ఇష్టపడే వాళ్ళ కోసమే నేను ఫోటోలు షేర్ చేస్తాను. అక్కడ ఎలాంటి ఫోటోలు షేర్ చేస్తాను అనేది నా ఇష్టం. నేను బికినీ వేసుకోవాలా? లేదంటే మొత్తం విప్పి తిరగాలా ? అనేది నా ఇష్టం. దానివల్ల ఎవ్వరూ ఇబ్బంది పడట్లేదు. అయినా నాపై మీ పెత్తనం ఏంటి ?" అంటూ అనసూయ ఫైర్ అయ్యింది. తాజాగా అనసూయ చేసిన ఈ కామెంట్స్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

Also Read: 'గేమ్ చేంజర్' తీగ లాగితే... 'దేవర', 'పుష్ప 2' గుట్టు బయటకు వచ్చిందా?