టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసే కలెక్షన్స్ పోస్టర్స్ కరెక్ట్ కాదని ప్రతి హీరో ఫ్యాన్, ఆడియన్ చెబుతాడు. అయితే, తమ అభిమాన హీరో సినిమా కలెక్షన్స్ పోస్టర్ కరెక్ట్ అని, ఫలహా హీరోది తప్పు అని చెబుతాడు. ఇక్కడ ఏకంగా 50 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన నిర్మాత తమకు వీక్‌నెస్‌లు ఉన్నాయని, అందుకే పోస్టర్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. 


'గేమ్ చేంజర్' కోసం అడిగితే...
ఆ రెండూ బయటకు వచ్చాయా?
రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' పోస్టర్ తీగ లాగితే... ఎన్టీఆర్ 'దేవర', అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాల గుట్టు బయట పడిందని సెటైర్లు పడుతున్నాయి. ఏ సినిమాకు ఎంత కలెక్ట్ చేసింది? అనేది పక్కన పెడితే... ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఎల్.వి.ఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.


నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు 'సంక్రాంతికి వస్తున్నాం' భారీ లాభాలు తెచ్చి పెట్టింది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ పెట్టారు. అందులో వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్.వి.ఆర్ ఒక కామెంట్ చేశారు. డిస్ట్రిబ్యూటర్లు 20 పర్సెంట్ కమిషన్ తిని చాలా రోజులు అయ్యిందని! దాని గురించి ప్రశ్నించగా కరెక్ట్ అని చెప్పారు. 


అప్పుడు 'రెండేళ్లుగా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి. పెద్ద పెద్ద అంకెలు పోస్టర్స్ మీద వేసిన సినిమాలు ఉన్నాయి' అని అడగ్గా... 'పోస్టర్స్ మీద నంబర్స్ వేస్తున్నారు. దాన్ని మేం కాదని అనలేపోతున్నాం. వాస్తవాలు మేం మాట్లాడలేకపోతున్నాం' అని ఎల్.వి.ఆర్ చెప్పారు. డిస్కషన్ కంటిన్యూ చేస్తూ... 'సినిమా హిట్ అని డిస్ట్రిబ్యూటర్లను ఫారిన్ తీసుకెళ్లిన సినిమాలు ఉన్నాయి' అని అడగ్గా... ''మా డిస్ట్రిబ్యూటర్స్ దౌర్భాగ్యం అదేనండీ. మేం బయటకు మాట్లాడకూడదు. మాట్లాడితే విరోధం. డబ్బులు పోగొట్టుకుని కూడా పోగొట్టుకోలేదని చెప్పుకొనే పరిస్థితి. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా. మేం నిజం చెబితే మాకు నెక్స్ట్ పిక్చర్ ఇవ్వరు. నష్టపోయి నెక్స్ట్ పిక్చర్ పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం'' అని ఎల్.వి.ఆర్ చెప్పారు. ఆడియన్స్ కలెక్షన్స్ పోస్టర్స్ చూసి నవ్వుతున్నారని ఆయన పేర్కొన్నారు.


Also Read: అల్లు అర్జున్ వస్తున్నాడు... కండిషన్స్ అప్లై... చైతూ టీమ్ అలా చేయక తప్పదు మరి!


ఇటీవల కాలంలో 'పుష్ప 2' పోస్టర్ మీద భారీ నంబర్స్ కనిపించాయి. అయితే, ఆ సినిమా గోదావరి జిల్లాల్లో సరిగ్గా ఆడలేని టాక్ ఉంది. డిస్ట్రిబ్యూటర్లను ఫారిన్ తీసుకు వెళ్లిన సినిమా అంటే 'దేవర'. ఆ రెండిటికీ అనౌన్స్ చేసిన కలెక్షన్స్ కరెక్ట్ కాదని, ఎక్కువ చేసి చూపించారని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే, 'గేమ్ చేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ అంత కంటే ఎక్కువ ట్రోల్ అవుతోంది.


'గేమ్ చేంజర్' ఫస్ట్ డే పోస్టర్... కరెక్ట్ కాదు!
'గేమ్ చేంజర్' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ కరెక్ట్ కాదని విమర్శలు ఉన్నాయి. 'సంక్రాంతికి వస్తున్నాం' డిస్ట్రిబ్యూటర్స్ ఈవెంట్‌లో దిల్ రాజు పరోక్షంగా ఆ విషయాన్ని అంగీకరించారు. ఫస్ట్ డే తర్వాత మళ్ళీ పోస్టర్ ఎందుకు రిలీజ్ చేయలేదని అడిగితే 'మాకు కొన్ని వీక్‌నెస్‌లు ఉంటాయి' అని చెప్పారు. లెక్కలు అందరికీ తెలుసు అన్నట్టు చెప్పారు. గతంలో నాగ వంశీ సైతం ఒక సందర్భంలో మేం అనౌన్స్ చేసే కలెక్షన్స్ అబద్ధమని చెప్పారు. ముందు కలెక్షన్స్ అనౌన్స్ చేయడం, తర్వాత కాదని చెప్పడం కంటే ఫేక్ కలెక్షన్స్ పోస్టర్ ట్రెండ్ ఆపేయడం బెటర్. 


Also Readవాచ్‌మేన్‌తో డ్యాన్స్ అదరగొట్టిన శ్రీలీల... వైరల్ వీడియో