Thandel Pre Release Event: అల్లు అర్జున్ వస్తున్నాడు... కండిషన్స్ అప్లై... చైతూ టీమ్ అలా చేయక తప్పదు మరి!

Allu Arjun - Thandel Pre Release: నాగచైతన్య కొత్త సినిమా 'తండేల్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ వేడుకకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏమిటో తెలుసా?

Continues below advertisement

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా సినిమా 'తండేల్' ప్రీ రిలీజ్ వేడుక ఇవాళ జనవరి రెండవ తేదీ సాయంత్రం హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో జరగనుంది. ఈ వేడుక (Thandel Pre Release Event)కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. అయితే... కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏమిటో తెలుసా?

Continues below advertisement

అభిమానులతో పాటు మీడియా కెమెరాలకు నో ఎంట్రీ!
అవును... తండేల్ ప్రీ రిలీజ్ వేడుకకు అటు అక్కినేని, ఇటు అల్లు అర్జున్ ఎవరి అభిమానులను ఆహ్వానించడం లేదు. సినిమా యూనిట్ సభ్యులు, ముఖ్య అతిథిగా హాజరు‌ కానున్న అల్లు అర్జున్ సహా అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈవెంట్ చేయాలని ప్లాన్ చేశారు.

అభిమానులను మాత్రమే కాదు... మీడియా కెమెరాలను కూడా అనుమతించడం లేదు. మీడియా ప్రతినిధులు ఈవెంట్ దగ్గరకు వెళ్ళవచ్చు. కానీ, కెమెరాలకు మాత్రం అనుమతి లేదని ముందస్తుగా సమాచారం ఇచ్చారు. ఈవెంట్‌కు వెళ్లే అవకాశం లేదని ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయినా... లైవ్ చూసే ఛాన్స్ ఉంది. (When and where to watch Thandel pre-release event live) గీతా ఆర్ట్స్ సంస్థకు చెందిన యూట్యూబ్ ఛానల్, అలాగే మీడియా ఛానళ్లలో లైవ్ చూడొచ్చు.

ఎందుకీ కండిషన్స్... ఈవెంట్ చేయడానికి ఆంక్షలు ఎందుకు?
సినిమా విడుదలకు ముందు హైప్ తీసుకు రావడంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ప్రెస్ మీట్ వంటివి ఎంతో హెల్ప్ అవుతాయి. ఎంత ఎక్కువ మంది అభిమానులు వస్తే... సినిమాకు అంత క్రేజ్ అన్నట్టు. అందుకే, ముందుగా అభిమానులు అందరికీ పాసులు ఇచ్చి మరి ఇన్వైట్ చేస్తారు. అటువంటిది నాగచైతన్య పాన్ ఇండియా సినిమాకు ఎటువంటి హడావిడి లేకుండా ఫంక్షన్ చేయడం ఏమిటి? ఎందుకు ఆంక్షలు? మీడియాను కూడా కెమెరాలు తీసుకు రావద్దని కండిషన్స్ పెట్టడం ఏమిటి? అంటే... సంధ్య థియేటర్ ఘటన ప్రస్తావించాలి!

Also Read: వాచ్‌మేన్‌తో డ్యాన్స్ అదరగొట్టిన శ్రీలీల... వైరల్ వీడియో

'పుష్ప ది రూల్' పెయిడ్ ప్రీమియర్ షో చూడడానికి అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లారు. ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో మహిళా అభిమాని రేవతి మృతి చెందారు.‌ ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చాలా రోజులు చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన అల్లు అర్జున్ అరెస్ట్ కు దారి తీయడం మాత్రమే కాదు... ఏకంగా పెయిడ్ ప్రీమియర్ బెనిఫిట్ షోలకు అనుమతి రద్దు చేసే వరకు వెళ్ళింది. దాంతో సినిమా ఇండస్ట్రీ జాగ్రత్త పడుతోంది.‌

సినిమా ఈవెంట్స్‌లో ఏ చిన్న ఘటన జరిగిన సరే... నిందలు మోయాల్సి వస్తుంది. ఈ కారణం చేత అభిమానులు ఎవరూ లేకుండా కేవలం చిత్ర బృందం సమక్షంలో ఈవెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు వాస్తవానికి శనివారం రాత్రి ఈవెంట్ జరగాలి అయితే... నట సింహం నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ వచ్చిన సందర్భంగా ఇండస్ట్రీలో ప్రముఖులతో పాటు రాజకీయ దిగజాలను ఆహ్వానించి నారా భువనేశ్వరి పార్టీ ఇచ్చారు అందువల్ల ఈ ఈవెంట్ ఇవాల్టికి వాయిదా పడింది.

Also Readహీరోలను వెయిట్ చేయిస్తూ... నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శ్రీ లీల?

Continues below advertisement
Sponsored Links by Taboola