సౌత్ లో తమపెళ్లికి సంబంధించిన విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ఓటీటీలకు అమ్ముకోవడం అనే ట్రెండు ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. నార్త్ లో ఇప్పటికే పలువురు స్టార్స్ ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యారు. కానీ సౌత్ లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ విషయంలో అడుగులు పడుతున్నాయి. తాజాగా అక్కినేని నాగ చైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ ఓటీటీలోకి అడుగు పెట్టబోతుంది అనే వార్త నెట్టింట్లో షికారు చేస్తోంది.
నాగ చైతన్య - శోభత ధూళిపాళ పెళ్లి ఏ ఓటీటీలో? గతేడాది స్టార్ కపుల్ నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించిన ఈ పెళ్లికి గెస్టులు మాత్రం లిమిటెడ్ గా హాజరయ్యి, కొత్తజంటను ఆశీర్వదించారు. అయితే ఈ పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీని ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారని, చై-శోభిత పెళ్లికి ముందే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఇవన్నీ ఒట్టి పుకార్లేనని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్' మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, మరోసారి నాగ చైతన్య - శోభిత పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ వార్త తెరపైకి వచ్చింది.
దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో నాగ చైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ డాక్యుమెంటరీ రైట్స్ డీల్ ని నెట్ ఫ్లిక్స్ తో నాగ చైతన్య - శోభిత 50 కోట్లకు కుదుర్చుకున్నారని టాక్ నడుస్తోంది. గతంలో హీరోయిన్ సమంతను నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి వైవాహిక జీవితం నాలుగేళ్లకే విడాకుల బాట పట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లు శోభితతో డేటింగ్లో ఉన్న నాగ చైతన్య ఫైనల్ గా ఆగస్టు 8న కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే పెళ్లిని మాత్రం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా చేశారు. ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో నాగ చైతన్య - శోభిత పెళ్లి స్ట్రీమింగ్ కాబోతుంది అనే వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది? అనే విషయం తెలీదు గానీ, వైరల్ గా మారింది.
నాగ చైతన్య బుజ్జి తల్లి శోభితనే గత ఏడాది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ పెళ్లి డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ డాక్యుమెంటరీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. పెళ్లిని ఏదో సినిమాలాగా ఓటీటీలకు అమ్ముకోవడం ఏంటి అనే విమర్శలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య - శోభిత పెళ్లి డాక్యుమెంటరీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'తండేల్' ఫిబ్రవరి 7న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక రియల్ లైఫ్ లో తన భరూయ శోభితను చై బుజ్జితల్లి అని పిలుస్తారట.
Also Read: స్టార్ డైరెక్టర్, హీరో అడిగారు... రిజెక్ట్ చేయడంతో అవకాశాలు రానివ్వలేదు - బాంబు పేల్చిన అనసూయ