Next on Netflix: నెట్‌ఫ్లిక్స్ ఇండియా.. ఇప్పుడు ఆల్‌మోస్ట్ బ్లాక్‌బస్టర్లన్నింటికీ కేరాఫ్. కాస్ట్ ప్రీమియం అయినా సరే.. క్వాలిటీ కంటెంట్ ద్వారా ఇండియన్ ఆడియన్స్‌లో క్రేజ్ తెచ్చుకుంది Netflix. ఈ స్ట్రీమింగ్ దిగ్గజం 2025 లో వచ్చే ప్రాజెక్టులను అనౌన్స్ చేసింది. Next on Netflix పేరుతో ముంబైలో భారీ ఈవెంట్ నిర్వహించింది. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నుంచి.. సౌత్ స్టార్లు వెంకటేష్, రానా, కీర్తి సురేష్ వరకూ ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

ఈ ఈవెంట్‌లో ఫస్ట్ అట్రాక్షన్ ఆర్యన్ ఖాన్. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్( Sharukh Khan) వారుసుడిని నెట్‌ఫ్లిక్స్ పరిచయం చేస్తోంది. అయితే ఆర్యన్ ఖాన్ ( Aryan Khan) వస్తోంది.. డైరక్టర్‌గా..! బాలీవుడ్ తళుకుల జీవితంపైన రెండేళ్లుగా ఆర్యన్ ఓ సిరీస్ తెరకెక్కించాడు. షారూఖ్ సొంత సంస్థ Red Chillies Entertainment దీనిని నిర్మించింది. సీనియర్ నటి మోనాసింగ్, మొన్న KILL సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన లక్ష్య ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్నారు. B***s of Bollywood అంటూ టైటిల్ అనౌన్స్ చేశారు. ఇందులో షారుఖ్‌ను ఆర్యన్ డైరక్ట్ చేస్తున్నట్లుగా చూపించారు.
వజ్రాలదొంగ సైఫ్
స్టార్ డైరక్టర్ సిద్దార్థ్ ఆనంద్ డిజిటల్ డెబ్యూ 2025లోనే అని Netflix India అనౌన్స్ చేసింది. ఆయన డైరక్ట్ చేస్తున్న Jewel Thief ఈ ఏడాదే రానుంది. సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) లీడ్ రోల్ చేస్తున్న ఈ వెబ్ సిరిస్‌లో జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat) కూడా నటిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆఫ్రికన్ రెడ్ సన్ డైమండ్‌ను దొంగిలించే కథాంశంతో ఈ సిరీస్ రానుంది.
నాయుడుగారి కుటుంబంలోకి అర్జున్
సౌత్ స్టార్లు బాబాయ్- అబ్బాయ్ వెంకటేష్- రానా కలయికలో వచ్చిన రానా నాయుడు సీజన్-2 కూడా ఇప్పుడే అనౌన్స్ చేశారు. నెట్ ఫ్లిక్స్ ఈవెంట్‌లో వెంకటేష్ రానానాయుడు గెటప్‌లో వచ్చారు. రానాతో పాటు సిరీస్ టీమ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు. అయితే సీజన్-2లో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ రానా నాయుడు ఫ్యామిలీలోకి వస్తున్నారు. అర్జున్ నాయుడు కుటుంబాన్ని ఎదుర్కొనే విలన్ రోల్ పోషిస్తున్నారు. Rana Naidu Season 2 టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది.
‘అక్క’ గా వస్తున్న కీర్తి
నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసిన వాటిలో ఇంట్రస్టింగ్ అనిపించింది అక్క Akka ఇద్దరు మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్లను కలిపి ఈ సిరీస్ తీసుకొస్తున్నారు. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్, టాలెంటెడ్ యాక్ట్రస్ Radhika Apte కలిసి ఈ సిరీస్‌లో నటిస్తున్నారు. సౌత్ స్టార్ కీర్తికి ఇదే మొదటి వెబ్ సిరిస్. టైటిల్ దగ్గర నుంచి కంటెంట్ వరకూ చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. నేషనల్ సిరీస్‌కు సౌత్ నేమ్‌తో టైటిల్ చేయడం ఒక విషయమైతే.. కీర్తి ఇంతకు ముందెన్నడూ చేయని ఓ వయలెంట్ రోల్ ఇందులో చేస్తున్నారు. రాధికా, కీర్తి రోల్స్ రెండూ కూడా చాలా ఇంట్రస్టింగ్‌గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ టీజర్ చూస్తుంటే మాతృస్వామ్య వ్యవస్థను ఎలివేట్ చేసేలా సిరీస్‌ను తీస్తున్నట్లు అర్థమవుతోంది. ఏమైనా కానీ కీర్తి సురేష్ ఓ కొత్త జోనర్‌లోకి అడుగుపెడుతున్నట్లే. ఇప్పటి వరకూ క్యూట్, యాక్టింగ్ ఓరియెంటెడ్ రోల్స్ చేసిన ఆమె.. మొదటి సారి యాక్షన్ సిరీస్ చేస్తున్నారు.
ఖాకీ- ఢిల్లీ క్రైమ్
ఇవి కాకుండా నెట్‌ఫ్లిక్స్ తన ప్లాగ్‌షిప్ సిరీస్‌లకు నెక్స్ట్ సీజన్‌లను తీసుకొస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్ పాపులర్ Delhi Crime కు మూడో సీజన్ వస్తోంది Shefali Shah, Rasika Dugal, Rajesh Tailang లతో పాటు ఈసారి మరొకొంత అట్రాక్షన్ జోడైంది. ఈ సీజన్‌కు హ్యూమా ఖురేషీ (Huma Qureshi) సయానీ గుప్తా ( Sayani Gupta) కూడా జాయిన్ అవుతున్నారు. ఇక నీరజ్ పాండే క్రైమ్ డ్రామా Khaki మూడో సీజన్ బెంగాల్ చాప్టర్ ఈ ఏడాదే వస్తున్నట్లు చెప్పారు. నెట్ ఫ్లిక్స్ లో బాగా ఫేమస్ అయిన మరో థ్రిల్లర్ Kohra కు కొనసాగింపుగా మరో సీజన్ వస్తోంది. రాజ్ కుమార్ రావు Toaster తోపాటు.. మాధవన్, ఫాతిమా సనా నటించి aap jaisa koi, ప్రతీక్ గాంధీ -యామీ గౌతమ్ DhoomDham, పులకిత్ సామ్రాట్ Glory, వాణి కపూర్ Mandala Murders, భూమి ఫడ్నేకర్ ఇషాన్ కట్టర్ Royal , R మాధవన్, సిద్ధార్థ్ ల TEST, ఇక Kapil Show .. ఇలా చాలా సిరీస్‌ల ఫస్ట్ లుక్‌లు, అప్‌డేట్లతో పాటు.. బోనీకపూర్ – శ్రీదేవీల చిన్న కూతురు ఖుషీ కుపూర్ Nadaaniyan మూవీ సాంగ్‌ను కూడా సోమవారం రాత్రి జరిగిన ఈవెంట్‌లోనే రిలీజ్ చేశారు.