Netflix First Telugu Series Super Subbu : హీరో సందీప్ కిషన్.. కామేడి కింగ్ బ్రహ్మనందం ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తెలుగు 'సిరీస్ సూపర్ సుబ్బు'. నెట్‌ఫ్లిక్స్ నుంచి వస్తోన్న మొట్టమొదటి తెలుగు వెబ్‌సిరీస్ ఇదేనంటూ.. Next On Netflix India సిరీస్‌లో భాగంగా ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. సెన్సిటివ్ టాపిక్ అయిన Sex Eductionపై ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. సూపర్ సుబ్బు పాత్రలో సందీప్ కిషన్ కనిపించగా.. అతను సూపర్ అన్‌లక్కీ అంటూ.. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే..
జాబ్ కచ్చితంగా చేయాల్సి పరిస్థితి వచ్చిన పాత్రలో సందీప్ కిషన్ ఈ సిరీస్‌లో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ వీడియో ఎలా సాగిందంటే.. సార్ ఏ ఉద్యోగం సార్.. కంప్యూటర్ జాబే కదా అంటూ సందీప్ అడగ్గా.. కాదు Sex Eduction అంటూ బ్రహ్మీ.. సుబ్బు లైఫ్‌లో బాంబ్ పేల్చుతాడు. దీంతో షాక్ అయిన సుబ్బు.. తను జాబ్ చేయాల్సిన పరిస్థితులు ఏంటో చెప్పేలా ఫస్ట్ లుక్ వీడియో చేశారు. నా ప్రేమ కోసం ఎంత దూరం వెళ్తావు సుబ్బు అంటూ గర్ల్ ఫ్రెండ్ ఓ వైపు.. కోడలు పిల్ల ఉంటూ కాస్త సాయంగా ఉంటుందంటూ తల్లి మరోవైపు.. వెంకీ పెళ్లి సుబ్బుగాడి చావుకొచ్చినట్లు.. సుబ్బుగాడి పెళ్లి సుబ్బగాడి చావుకొచ్చిందంటూ సంపూర్ణేశ్ బాబు చెప్తాడు.
ఇదే నీ లాస్ట్ ఛాన్స్ అంటూ సుబ్బు వార్నింగ్ ఇచ్చే పాత్రలో మురళి శర్మ కనిపించారు. ఇవన్నీ ఆలోచించుకున్న సుబ్బు.. కచ్చితంగా సెక్స్ ఎడ్యూకేషన్ జాబ్‌ను చేసేందుకు ఒప్పుకుంటాడు. ఇంతకీ జాబ్ ఏ ఊరంటూ అడగ్గా.. పాస్ పోసినంత ఈజీగా పిల్లలను కనే ఊరు సార్ అది అంటూ హైపర్ ఆది చెప్తాడు. మాఖీపూర్ అంటూ వీడియో ఎండ్ అవుతుంది. ఇంతకీ ఆ ఊరులో ఏమి జరిగింది.. సెక్స్ ఎడ్యూకేషన్ చెప్తూ.. సుబ్బు ఎన్ని కష్టాలు పడతాడు.. తన ప్రేమ దక్కిందా.. ఆ తర్వాత కథ ఎలా ముందుకు వెళ్లిందనేది సిరీస్‌లో చూడాలి.
ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, బ్రహ్మానందం ప్రధానపాత్రలు చేస్తుండగా.. బబుల్ గమ్ మూవీ ఫేమ్ మానస చౌదరి, ఓరి దేవుడా సినిమా ఫేమ్ మిథిలా పాల్కర్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే ఈ ఫస్ట్‌లుక్‌లో మిథిలాను రివీల్ చేయలేదు. సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది, గెటప్ శీను కూడా ఈ సిరీస్‌లో నటిస్తున్నారు. టిల్లూ స్క్వేర్ డైరక్టర్ మల్లిక్ రామ్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. చిలక ప్రొడక్షన్స్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.